Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

Webdunia
FILE
మనం సకల దేవతలను ఆరాధిస్తున్నాం. ఇష్టదైవాల్ని ఎన్నుకోవడం ఆయా భక్తుల అనుభూతులపై, మహిమలపై ఆధారపడి ఉంటుంది. అష్టోత్తర సహస్రనామ అర్చనలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇష్టదైవాలకు అవసర నైవేద్యం, మహానైవేద్యం, తాంబూల సమర్పణ, హారతి (నీరాజనం) మంత్రపుష్పం, తీర్ధస్వీకారం, ఫలశ్రుతి అనంతరం పూజ సమాప్తమగును. అయితే ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా అయితే ఇంకా చదవండి.

దేవతలకు సమర్పించవలసిన నైవేద్యాలు

విఘ్నేశ్వరునికి..
బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.

శ్రీ వేంకటేశ్వరస్వామికి
వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను.

ఆంజనేయస్వామికి
అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.

లలితాదేవికి
క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.

సత్యనారాయణస్వామికి
ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.

దుర్గాదేవికి
మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.

సంతోషీమాతకు
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.

శ్రీ షిర్డీ సాయిబాబాకు
పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం

శ్రీకృష్ణునకు
అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించడం ఉత్తమం

శివునకు
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

సూర్యుడుకు
మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.

లక్ష్మీదేవికి
క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

Show comments