Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుద్ర నక్షత్రమా? ఐతే అవమానాన్ని సహించలేరు

Webdunia
WD
రాహుగ్రహ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు అవమానాన్ని ఏ మాత్రం సహించలేరని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వాక్ చాతుర్యం, అద్భుతమైన హాస్య సంభాషణలు, జ్ఞాపకశక్తి మెండుగా కలిగి ఉండే ఈ జాతకులు వ్యాపార పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

అంతేగాకుండా.. ఈ జాతకులు ఇతరుల ఉన్నత స్థాయికి ఇటుక రాళ్ళవలె ఉపయోగపడుతారు. ఎలాంటి కార్యాన్నైనా పట్టుదలతో సాధించే ఆరుద్ర నక్షత్ర జాతకులకు కీర్తియోగం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది.

తప్పుడు సలహాలు, ప్రతీకార వాంఛ, పలుకుబడి వంటివి జీవితంలో కొన్ని ఒడిదుడుకులకు కారణమవుతాయి.

ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం ద్వారా చిక్కుల్లో పడతారు. తల్లిదండ్రుల వల్ల, సహోదరి, సహోదరుల పట్ల విశేషమైన ప్రేమ కలిగి ఉంటారు. రాత్రిపూట ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వీరి గుణం. ఎంతమంది వీరిని వీడి వెళ్ళినా, అసాధారణ తెలివితేటలతో సమాజంలో ఉన్నత స్థాయిని సాధిస్తారు. స్త్రీల గౌరవం పట్ల గౌరవం కలిగి ఉంటుంది.

అయితే.. ఆర్థిక విషయాలపై ఆరుద్ర నక్షత్ర జాతకులు సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోలేరు. అందుచేత ఇబ్బందుల నుంచి బయటపడాలంటే.. బుధవారం పూట నవగ్రహ ప్రదక్షిణ చేసి, నేతితో దీపమెలిగించడం శ్రేయస్కరం. ఈ జాతకులు బుధవారం ఏ పనిని చేపట్టినా కలిసొస్తుంది. గురువారం సామాన్య ఫలితాలనిస్తుంది.

అయితే సోమవారం నాడు మాత్రం ఈ జాతకులు ఎలాంటి పని చేపట్టకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. పసుపు రంగు వీరికి కలిసొస్తుంది. ఎప్పుడూ పసుపు రంగు రుమాలును చేతిలో పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతకుల అదృష్ట సంఖ్య: 5.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

Show comments