Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెల ఎలా ఉంటుంది...!

వ్యాపార వర్గాలకు విశేషమైన లాభాలు కలుగుతాయి

Webdunia
FILE
ఆగస్టు నెలలో గ్రహాల పరిస్థితిని గమనిస్తే శుక్రుడు మిథునరాశిలోనున్నాడు. గోధుమలు, బియ్యం, మరియు శెనగల ధరలు అధికంగా ఉంటాయి.

దీంతోపాటు బుధుడు సింహరాశిలోనుండటంచేత అన్నిరకాల ధాన్యాల ధరలు అధికంగానే ఉంటాయి. కాని ఈ ధరలు స్థిరంగా ఉంటాయి. బంగారం ధరలు అధికమయ్యే సూచనలు కనపడుతున్నాయంటున్నారు జ్యోతిష్యులు.

అలాగే గురువు మకరరాశిలో ఉన్నాడు. ఇది గురువుకు నీచరాశి. ప్రభుత్వ కార్యకలాపాలలో ఆటంకాలు ఏర్పడే సూచనలున్నాయి. ఇది ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాయంటున్నారు జ్యోతిష్యులు.

రానున్న మూడు నెలల తర్వాత పరిస్థితి కాస్త మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనపడుతున్నాయి. ఈ నెలలోనే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ వస్తోంది. ఈ రోజున బ్రాహ్మణులు శ్రావణమాసపు పూజ చేసుకుంటారు. దేశవ్యాప్తంగా తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కడతారు.

రవి-కేతువుల ముందు శని ఉండటంమూలాన విపరీతమైన గాలులతోపాటు సాధారణమైన వర్షం, అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆగస్టునెల 16న కుజుడు తన శత్రురాశియైన మిథునంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఎర్రటి వస్తువులు, ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉంటాయి.

ఆగస్టునెల 19న బుధుడు తనకు ప్రీతిపాత్రమైన ఉచ్చరాశి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో బంగారం మరియు చక్కెర ధరలు దాదాపు ఆరు నెలల వరకు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపార వర్గాలవారికి విశేషమైన లాభాలు చేకూరుతాయి. ఆ తర్వాత ధరలు తగ్గే సూచనలున్నాయి.

పశువులు మరియు ధాన్యంపై ప్రత్యేక దృష్టి పెడితే ఆగస్టునెల 12న శని ఉత్తర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో పశువుల నష్టం సంభవించవచ్చు. అలాగే ధాన్యాల ధరలు అధికంగా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. మిగిలిన ధాన్యాల ధరలుకూడా మరో ఆరు నెలల వరకు తగ్గే సూచనలు కనపడటం లేదు.

ఆగస్టునెల 16న రవి సింహరాశిలో ప్రవేసిస్తుండటంతో పశ్చిమ, దక్షిణ దేశాలలో దుర్భిక్షం తాండవించవచ్చంటున్నారు జ్యోతిష్యులు. అలాగే ఉత్తర ప్రాంతాలలోనున్న దేశాలలో యుద్ధం సంభవించే ప్రమాదముంది.

మరో విశేషం ఏంటంటే తూర్పు దేశాలలో సుఖ-శాంతులు విరాజిల్లనున్నాయి. ఆగస్టునెల 20న శుక్రుడు కర్కాటకరాశిలో ప్రవేస్తున్నాడు. దీంతో రసాలనిచ్చే ఆహార పదార్థాల ధరలు అధికమౌతాయి. కొన్ని రకాల ధాన్యాలు చౌకగా లభిస్తాయి. ఆగస్టునెల 26న కుజుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుండటంతో నల్లటి నువ్వుల వ్యాపారస్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, అసోం, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో కొన్ని చోట్ల సాధారణ స్థాయిలో, మరికొన్ని చోట్ల అత్యధికంగా వర్షం కురిసే అవకాశాలున్నాయి. పర్వత ప్రాంతాలలో వడగండ్లతోకూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు జ్యోతిష్యులు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..

Sravana masam 2025: శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఇలా చేస్తే?

Sravana Mangalvaram-శ్రావణ మంగళవారం.. హనుమంతుడు, దుర్గమ్మను పూజిస్తే ఏంటి ఫలితం?

Show comments