Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటలు నేర్చిన మా నరజాతి మారణహోమం సాగించేను( వీడియో)

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (21:32 IST)
భక్త తుకారం చిత్రంలోని బలే బలే అందాలు సృష్టించావనే పాటను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు, అంజలీ దేవి నటించారు. ఈ పాటకు సంగీతం: పి. ఆదినారాయణ రావు, రచన: వీటూరి. పాడినవారు ఘంటసాల వెంకటేశ్వర రావు.
 
నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలీ... 
మరచితివో మానవజాతి దయమాలి
 
బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
 
చరణం 1
మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలిసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి
మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి
మనిషే పెరిగి మనసే తరిగి
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు.... |బలే|
 
చరణం 2
చల్లగ సాగే సెలయేటివోలె
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలె
అందరు ఒక్కటై నివశించాలి
స్వార్థం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి... |బలే|

పాట వీడియో- యూ ట్యూబ్ నుంచి... 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

APSRTC: మేలో 2వేల బస్సులు కావాలి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారా? కస్టమర్లకు శుభవార్త చెప్పిన ట్రాయ్

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఏపీకి పొంచివున్న భారీ వర్షాలు

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

Show comments