Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి పెళ్లి కోసం భార్య ఇండియాకు, అమెరికాలో భర్త మంచంపై శవమై తేలాడు

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (15:51 IST)
విదేశాల మోజు మొదట్లో బాగానే వుంటుంది. కానీ ఏదయినా అనుకోనిది జరిగినప్పుడు గుండెలు బద్ధలవుతాయి. ఇలాంటిదే ఒకటి అమెరికాలో ఓ తెలుగు కుటుంబానికి ఎదురైంది.
 
వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోడుప్పల్‌కు చెందిన శ్రీధర్ ఆరేళ్ల క్రితం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా స్థిరపడ్డాడు. తన భార్య ఝాన్సీ, కుమారుడు శ్రీజన్‌తో కలిసి వుంటున్నాడు. ఐతే గత మార్చి నెలలో తన సోదరుడి వివాహం వుండటంతో భార్య ఝాన్సీ ఇండియా వచ్చింది. కరోనా లాక్ డౌన్‌తో ఆమె ఇక్కడే చిక్కుకుపోయింది.
 
ఇక అప్పట్నుంచి శ్రీధర్ ఒంటరిగా అక్కడే వుంటున్నాడు. ఐతే అతడి కుటుంబానికి పిడుగులాంటి వార్త చేరింది. శ్రీధర్ గత నెల 27వ తేదీ మృతి చెందాడని చెప్పారు. అతడు చనిపోయిన వారం తర్వాత ఈ వార్త తెలియడంతో అతడి భార్య, కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మృతదేహానికి కోవిడ్, పోస్టుమార్టం నిర్వహించినా అతడి భౌతికకాయాన్ని పంపించడంలో అయోమయం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తన భర్త పార్థీవశరీరాన్ని భారతదేశానికి తెప్పించాల్సిందిగా భార్య ఝాన్సీ కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

తర్వాతి కథనం
Show comments