'తానా' మహాసభల భద్రతా విభాగం విశేషాలు

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (14:43 IST)
20వ తానా మహాసభలు డిట్రాయిట్ కోబో హాలులో జూలై 2 నుండి 4వ తేదీ వరకు జరుగనున్నవి. పదివేల మందికిపైగా దేశ విదేశాల నుండి ఈ మహాసభలకు హాజరుకానున్నారు. ఈ సభలలో ప్రణాళికాబధ్ధంగా నిర్వహించే సాహితీ, సాంస్కృతిక, వాణిజ్య, ఆధ్యాత్మిక, ధీంతాన తదితర కార్యక్రమాలు నిర్వహించడానికి, క్రమబధ్ధం చేయడానికి, రక్షణ వ్యవస్థను పటిష్ఠంగా ఉంచడానికి తానాలో ప్రత్యేక విభాగం పని చేస్తున్నది.
 
ఈ సెక్యురిటీ కమిటీ అధ్యక్షులుగా మహీధర రెడ్డి, నరేష్ కొల్లి, శ్రీనివాస కొండ్రగుంట కో-చెయిర్లుగా, సభ్యులతో కలసి కార్యక్రమాల పర్యవేక్షణను, పటిష్టమైన బందోబస్తు కొరకు కమిటీ సన్నాహాలు చేస్తున్నారు. సభా కార్యక్రమాల నిర్వహణకు సేవా సైన్యంగా పనిచేసే భద్రతా విభాగ సేవలు అత్యంత ఆవశ్యకం. దీనిని దృష్టిలో పెట్టుకొని కోబో హాలులో ప్రధాన వేదిక, పలు ఇతర వేదికలు, రిజిస్ట్రేషన్ తదితర విషయాలలో కమిటీల అండగా నిలచే సెక్యూరిటీ విభాగం నిర్వహణ, పర్యవేక్షణ ఈ కమిటీ బాధ్యతలుగా చర్యలు చేపడుతున్నది. 
 
కమిటీ పలుమార్లు సమావేశమై సభలకు వాలంటీర్లను సిధ్ధం చేస్తున్నది. నగర సెక్యూరిటీ సంస్థలతో చర్చలు జరిపి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నది. సమావేశాలకు వచ్చే తెలుగువారందరూ కార్యక్రమాలు జయప్రదం కావడానికి తమతో సహకరించవలసినదిగా సెక్యూరిటీ కమిటీ భద్రతా విభాగం విజ్ఞప్తి చేస్తున్నది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కు 'సర్' నోటీసులు

వెనెజులా ముగిసింది, గ్రీన్ ల్యాండ్ పైన ట్రంప్ కన్ను, ఏం జరుగుతుంది?

Power Bills: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గనున్న విద్యుత్ బిల్లులు.. చంద్రబాబు నాయుడు

ఏపీ పోలీసులు నీళ్లు లేని బావిలో దూకండి: ఆర్కే రోజా వివాదాస్పదం (video)

Jana Sena: తెలంగాణలోని అన్ని పార్టీ కమిటీలను రద్దు చేసిన జనసేన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

అనసూయ హీరోయిన్ కాదా?

ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత సారథ్యంలో గాంధీ టాక్స్ విడుదలకు సిద్ధమవుతోంది

క్రాంతి మాధవ్ మూవీ దిల్ దియా.లో భిన్నమైన పాత్రలో చైత‌న్య‌రావు

Bellamkonda: టైసన్ నాయుడు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్

Show comments