బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన సాయిదత్త పీఠం

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (09:51 IST)
న్యూ జెర్సీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది.

 
బిపిన్ రావత్‌తో పాటుగా సైన్యంలో సేవలందించిన కల్నల్(రిటైర్డ్ ) వీరేంద్ర ఎస్ తవాతియా, రావత్‌తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు.

 
ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయిదత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌, వారి సతీమణి మధులికతో పాటు మిగిలిన సైనికులకు కూడా అందరూ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘుశర్మ శంకరమంచి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

తర్వాతి కథనం
Show comments