Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికులేటర్ భాను ప్రకాశ్‌తో నాట్స్ వెబినార్

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (22:44 IST)
టెంపాబే: అమెరికాలోని తెలుగు విద్యార్ధుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా వరల్డ్ ఫాసెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం, ఓం సాయి బాలాజీ టెంపుల్ సంయుక్తంగా చేపట్టిన ఈ వెబినార్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఎంత పెద్ద లెక్కయినా చిటికెలో చెప్పేసే నీలకంఠ భాను ప్రకాష్ లెక్కల చిట్కాలను విద్యార్ధులకు వివరించారు.
 
మ్యాథ్స్ ద్వారా మన మేథస్సును ఎలా పెంచుకోవచ్చు..? మన మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుందనేది ఈ వెబినార్‌లో నీలకంఠ భాను ప్రకాష్ వివరించారు. ప్రవాస తెలుగు విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు భాను ప్రకాశ్ సమాధానాలు చెప్పారు. లెక్కలను సులువుగా ఎలా చేయాలనేది వివరించారు. ఈ వెబినార్‌లో  దాదాపు 500 మందికిపైగా విద్యార్ధులు పాల్గొన్నారు.
 
ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వెబినార్ విద్యార్ధులకు చాలా ఉపయుక్తంగా ఉందని విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపారు. ఇదే స్ఫూర్తితో నాట్స్ మార్చి 14న "మీలో కంప్యూటర్‌ను ఎలా ఆన్ చేయాలి" మార్చి 21న "గణితానుభవం" మార్చి 28 న "ప్రత్యామ్నాయ గణిత సంస్కృతి" వెబినార్స్‌ను నాట్స్ నిర్వహించనుంది.
 
ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుతికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్‌,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త  ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టాంపాబే చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, నాట్స్ స్థానిక నాయకులతో పాటు ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయానికి చెందిన సూర్యనారాయణ మద్దుల, వంశీ తమ్మన, విశాలి ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
 
ఈ వెబినార్‌కు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్ముడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి లకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments