Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్స్ ప్రస్థానంలో మరో కీలక అడుగు... హ్యూస్టన్‌లో కొత్త చాప్టర్ ప్రారంభం

హ్యూస్టన్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రస్థానంలో మరో కీలకమైన ముందడుగు పడింది. అమెరికాలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ నాట్స్ విభాగాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ క్రమంలోనే నాట్స్ హ్యూస్టన్ చాప్టర్ ప్రారంభమైంది. హేమంత్ కొల్ల నాయకత్వంలో ఏర్పాటైన హ్యూస

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (14:53 IST)
హ్యూస్టన్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రస్థానంలో మరో కీలకమైన ముందడుగు పడింది. అమెరికాలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ నాట్స్ విభాగాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ క్రమంలోనే నాట్స్ హ్యూస్టన్ చాప్టర్ ప్రారంభమైంది. హేమంత్ కొల్ల నాయకత్వంలో ఏర్పాటైన  హ్యూస్టన్ నాట్స్ విభాగం ఇక ఇక్కడ  తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. 
 
హ్యూస్టన్ చాప్టర్ ప్రారంభానికి విచ్చేసిన నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ.. నాట్స్ లక్ష్యాలను, ఆశయాలను హ్యూస్టన్ నాట్స్ సభ్యులకు వివరించారు. హేమంత్ కొల్ల నాట్స్ చాప్టర్ కోసం చేసిన కృషిని మోహన కృష్ణ ప్రశంసించారు. హేమంత్ మంచి నాయకుడు, చక్కటి యువ నాయకులతో టీంని ఏర్పరచుకున్నాడు. ఈ టీం ముందుముందు మంచి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే దీనికి  ప్రతి ఒక్కరి సహకారం కావాలి. ఆ సహకారం  మీ నుంచి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను అని మోహన కృష్ణ మన్నవ అన్నారు.
 
నాట్స్ హ్యూస్టన్ చాప్టర్ ఏర్పాటులో నాట్స్ న్యూజెర్సీ కో-ఆర్డినేటర్ వంశీ వెనిగళ్ల కీలక పాత్ర పోషించారు. నాట్స్ హ్యూస్టన్‌లో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. హరికేన్ ధాటికి విలవిలలాడిన హ్యూస్టన్‌లో నాట్స్ బాధితులను ఆదుకునేందుకు సహాయ చర్యలు కూడా చేపట్టి అందరి మన్ననలు పొందింది. హరికేన్ వచ్చిన తర్వాత వెనువెంటనే రంగంలోకి దిగిన నాట్స్ సభ్యులు.. బాధితుల ఇళ్లకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి ఇంటి ముందు ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు.. అందరికీ ఆహార పొట్లాలను పంపిణి చేశారు.
 
హ్యూస్టన్ వరద బాధితులకు 25 వేల డాలర్లతో నిత్యావసరాలు అందించి ఆపద సమయంలో తన వంతు సాయం చేసింది. నాట్స్ వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి హరికేన్ బాధితులను ఆదుకోవడంతో నాట్స్ పైన స్థానికంగా ఉండే తెలుగువారిలో అభిమానం మరింత రెట్టింపయ్యింది. వారంతా ఇప్పుడు సేవే గమ్యం అని నినదించే నాట్స్ వెంట నడిచేందుకు సిద్ధమని ప్రకటించారు. దాదాపు 200 మంది స్థానిక తెలుగువారు నాట్స్ హ్యూస్టన్ చాప్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
 
హేమంత్  కొల్ల సమన్వయకర్తగా ఉన్న నాట్స్ హ్యూస్టన్ చాప్టర్‌లో సునీల్ పాలేరు, శ్రీనివాస్ కాకుమాను, చంద్రమౌళి తెర్లి, వీరూ కంకటాల, శ్రీనివాస్ మంతెన, విజయ్ దొంతరాజు తదితరులు కీలక సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక నుంచి నాట్స్ హ్యూస్టన్ చాప్టర్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళతామని వారు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

తర్వాతి కథనం