Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ జయంతి సందర్భంగా డాలస్లో ప్లాజాలో ప్రత్యేక కార్యక్రమాలు : ప్రసాద్ తోటకూర

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2015 (10:34 IST)
మహాత్మా గాంధీ 146వ జయంతిని పురస్కరించుకొని అమెరికాలోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డాలస్లోని పార్క్ ప్లాజా టవర్ వద్ద ఈ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఛైర్మన్ ప్రసాద్ తోటకూర తెలిపారు. 
 
అలాగే, అదేవిధంగా టెక్సాస్లోని ఇర్వింగ్లో ఉన్న మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఈ శనివారం సాయంత్రం 8 గంటలకు 'గాంధీ శాంతి పాదయాత్ర (నడక)'ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాదయాత్రకు ముందు శాంతికి చిహ్నమైన తెల్ల పావురాలను ఆకాశంలోకి ఎగుర వేస్తామని తెలిపారు. 
 
ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారిని తెల్ల దుస్తులు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సుకన్య భరత్ రామ్ హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రావు కల్వల, శ్రీనివాస్ గునుకుల, తైయాబ్ కుండవల, జాక్ గోదావని, అక్షయ్ వని, పీయూష్ పటేల్, షబ్నం మోగ్లీ, జీన్ హమెండ్ తదితరులు సహకరించనున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments