Webdunia - Bharat's app for daily news and videos

Install App

డల్లాస్ సభలో భావోద్వేగంతో మెగాస్టార్‌ ప్రసంగం

మెగాస్టార్ చిరంజీవి తానా నిర్వ‌హిస్తోన్న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వారు చూపించిన అభిమానానికి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ... మన

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (12:41 IST)
మెగాస్టార్ చిరంజీవి తానా నిర్వ‌హిస్తోన్న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వారు చూపించిన అభిమానానికి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ... మనసాంతరాల్లోంచి మాట్లాడతానని ఇక్కడ నిలబడేవరకు తెలియదు. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. 
 
ఈమధ్య నా మనసుని తాకిన ఆప్యాయత, ఆత్మీయ సమావేశం ఏదైనా ఉందంటే ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ సమావేశమే. సమయం దాటిపోయింది, అందరూ ఆకలితో ఉన్నారని, కొద్దిగానే మాట్లాడి త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోదామనుకున్నాను. తానా వారి ఆహ్వానంతో అమెరికాకు వచ్చాను. ఇక్కడి కొంతమంది అభిమానులు నన్ను కలవాలని అనుకుంటున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 
 
ఆయ‌న అలా చెప్ప‌ిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డికి వెంట‌నే రావాల‌నిపించి వచ్చాను. ఇక్కడ తానా పేరుతో ఓ అసోసియేషన్‌ ఉందని కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. మీరు గుర్తింపు కోసం కాదు.. సంతృప్తి కోసం సేవ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... నిశబ్ద సైనికులలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేను మీకు స్ఫూర్తి అన్నారు.. చెప్పాలంటే, మీరే నాకు స్ఫూర్తి అని చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments