Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ శాంతికి తానా ఆధ్యాత్మిక విభాగం

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (13:08 IST)
జీవితాన్ని సరియైన పంథాలో నడిపించడానికి ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక భావం, ఆలోచనలు మనిషిని యాంత్రిక జీవనం నుండి విముక్తి చేయడానికి దోహదపడుతాయి. నైతిక బలం, స్వార్థ రాహిత్యం, నమ్రతలు తెలిపేది ఆధ్యాత్మిక చింతన. ఈ అనుభూతి, ఆనందం వేరు. మనసును మంచితనంతో నింపుకొంటే చంచలత్వం పోయి, ఆధ్యాత్మిక చింతన స్థిరపడుతుంది. పెద్దవారికైనా, చిన్నవారికైనా ఆధ్యాత్మిక చింతన అవసరం. ఆలయాలైనా, ప్రార్థనా స్థలాలైనా ధ్యానం, ప్రార్థన, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మనసులకు ప్రశాంతత చేకూరుస్తాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని 20వ తానా మహాసభలలో ఆధ్యాత్మిక కమిటీ వారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
20వ తానా మహాసభలలో సాయి సత్య వ్రతం, శోభారాజు గారి భక్తి సంగీత కార్యక్రమం, తి.తి.దే ట్రస్టు వారిచే శ్రీనివాస కళ్యాణం, , డా|| మేడసాని మోహన్ గారి ఆధ్యాత్మిక ప్రసంగం, శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం గారిచే భక్తి సంగీత కార్యక్రమం, స్థానిక దేవాలయాల సందర్శన వంటి అనేక కార్యక్రమాలకు కమిటీ వారు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా శనివారం 4 వ తేదిన డిట్రాయిట్ కాలమాన ప్రకారం ఉదయం 10:30 నుండి మధ్యాన్నం12:30 వరకు బ్రహ్మశ్రీ చాగంటి కొటేశ్వరరావు గారి ప్రవచనాలు కాకినాడ నుండి టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుపబడుతుంది.
 
పిల్లలలో ఆధ్యాత్మిక భావం, భక్తిని దోహదపరిచేందుకు 8 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు గలవారికి ఆధ్యాత్మిక జ్ఞానంలో ఈసారి ఈ విభాగం క్విజ్ ఏర్పాటు చేసింది. ఈ క్విజ్‌లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా $500 , రెండవ బహుమతిగా $250, తృతీయ బహుమతిగా $100 ఇవ్వడం జరుగుతుంది. ఈ క్విజ్‌లో పాల్గొనడానికి ఉత్సాహవంతులైన వారు tana2015.rs@gmail.com కి ఇ-మెయిలు ద్వారా సంప్రదించవచ్చు.
 
ప్రసాద్ రావిపాటి చెయిర్ పర్సన్‌గా వేంకటేశ్వరరావు గుత్తా, రమ కాకులవరపు కో-చెయిర్‌లుగా కమిటీ సభ్యులతో కలసి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. సుఖాల కోసం ఈ ప్రపంచం మీద ఆధారపడకుండా మనకు కావలసిన ఆనందం మనలో నుండే పొందగలిగితే అదే ఆధ్యాత్మికత అని స్వామి వివేకానంద చెప్పినట్టు మానసిక సంతృప్తి, ఆనందం కలిగించడమే కాకుండా యువతరానికి భారతదేశ సంస్కృతీ, సాంప్రదాయాలను నిలబెట్టడానికి, చేసే కృషిలో అమెరికాలో సాగుతున్న ఆధ్యాత్మిక ప్రక్రియే ఈ తానా ఆధ్యాత్మిక విభాగం సంకల్పన. అఖిల మానవ శ్రేయస్సుకు లోక సమస్తా సుఖినోభవంతు అన్న రీతిలో ప్రపంచ శాంతికి దోహదపడటమే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments