Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరుగా సాగుతున్న20వ తానా మహా సభల సన్నాహాలు

Webdunia
సోమవారం, 18 మే 2015 (15:59 IST)
తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, మహాసభల కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ గారి అధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జూలై 2,3,4 తేదీలలో డిట్రాయిట్‌లో జరుగబోతున్న 20వ తానా మహాసభల సన్నాహాలు ఊపందుకున్నాయి. వివిధ కమిటీలు ఈ మహాసభలు జయప్రదంగా జరగటానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. 
 
రిజిస్ట్రేషన్:
మే 18వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి తగ్గింపు ఆఫర్ తానా ప్రకటించింది.
ఆ వివరాలు..
రిజిస్ట్రేషన్ క్యాటగిరీ
పెద్దలు ఒకరికి   - $150 ( మే 18వరకూ ధర), $175 ( మే 18 తర్వాత)
చిన్నారులు – వయలు  6-17 ( 5 కంటే తక్కువ ఉచితం) -  $75 ( మే 18వరకూ ధర),  $110 ( మే 18 తర్వాత)
పూర్తిస్థాయి విద్యార్థి (విద్యార్థి ఐడి కార్డు అవసరం)  - $100 ( మే 18వరకూ ధర), $125 ( మే 18 తర్వాత)
జంట (భార్య & భర్త)-    $275 ( మే 18వరకూ ధర), $325  ( మే 18 తర్వాత)
వయోవృద్ధులు – 65 సంవత్సరాలు ఆపైన - $100 ( మే 18వరకూ ధర), $125 ( మే 18 తర్వాత)
సందర్శకుడు (వీసా ధృవీకరణ అవసరం) - $100 ( మే 18వరకూ ధర),  $125 ( మే 18 తర్వాత)
రిజిస్ట్రేషన్ల కోసం tana2015.org లోకి లాగిన్ అవ్వండి.
 
'దీం'తాన:
అమెరికాలో 15 ముఖ్య నగరాలలో జరుగుతున్నా 'దీం'తానా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మిన్నసోట, డల్లాస్, న్యూజెర్సీ, హౌస్టన్, బోస్టన్ నగరాలో పోటీలు పూర్తయ్యాయి. ప్రతి నగరం నుండి విజేతలు అందరూ జూలై 2, 3, 4 తేదీలలో జరగబోయే తానా మహాసభల ఫైనల్స్‌లో పాల్గొంటారు. డిట్రాయిట్‌లో జూన్ 7న జరగబోయే దీంతాన పోటీలలో పాల్గొనేవారు మే 16 లోపు మీ వివరాలు పంపవలసింది గా దీంతానా కమిటీ కోరుతుంది. వివరాలకు... tana2015.org/committee/dhimtana-committee చూడగలరు.
 
చిత్రలేఖనం పోటీలు
తాన చరిత్రలో మొట్ట మొదటి సారిగా తెలుగు కళా వేదిక ద్వారా ART SHOW నిర్వహించటానికి తాన సన్నాహాలు చేస్తుంది.. ఈ ART SHOWలో పాల్గోనగోరే వారు జూన్ 12వ తేదీ లోపు అప్లికేషను ujwalabandi.tana@gmail.comకు పంపించవలసిందిగా ఆర్ట్ & క్రాఫ్ట్ ఛైర్పర్సన్ శ్రీమతి ఉజ్వల బండి గారు కోరుతున్నారు.. అత్యుత్తమైన 25 ఆర్ట్స్‌ను తాన మహాసభలలో ప్రదర్శిస్తారు. 
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. tana2015.org/committee/arts-craft-committee.html
 
ఆటల పోటీలు 
20వ తానా మహా సభలలో భాగంగా డిట్రాయిట్‌లో వివిధ ఆటల పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చెస్, కారోమ్స్, బ్యాడ్మింటన్ , టేబుల్ టెన్నిస్, త్రో బాల్ పోటీలు పూర్తయ్యాయి. మే 24న క్రికెట్, మే 31న టెన్నిస్, జూన్ 6న వాలీబాల్ పోటీలు జరుగబోతున్నాయి. ఈ పోటీలలో పాల్గొనే ఆసక్తి వున్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా స్పోర్ట్స్ కమిటీ కోరుతుంది. వివరాలకు క్లిక్ చెయ్యండి.. tana2015.org/committee/games-sports-committee.html
 
సావనీర్ 
తానా మహా సభలకు విచ్చేసే ప్రతి ఒక్కరికి అందచేసే సావనీర్ అందంగా తయారవుతుంది. 300 పేజీలతో 3000 కాపీలను ప్రింట్ చేస్తున్నారు. సావనీర్‌లో ప్రకటనలు ఇవ్వగోరే వారు మే 24వ తేదీ లోపు మీ ప్రకటనలను TANA.Souvenir.Ads@gmail.com  పంపించవలసిందిగా కోరుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చెయ్యండి ana2015.org/committee/souvenir-ads-committee.html
Spiritual committee
 
తానా మహా సభల సందర్భంగా spiritual కమిటీ జూలై 3వ తేదీన శ్రీ షిరిడి సాయిబాబా సత్యవ్రతం మరియు జూలై 4వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తుంది. ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలు, ప్రవచనాలు, భక్తి సంగీత కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తుంది.. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారితో కాకినాడ నుండి లైవ్ ప్రోగ్రాం  ఉండబోతుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చెయ్యండి tana2015.org/committee/spiritual-committee.html
 
మహిళల ఫోరం
తానా మహా సభలలో మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు మహిళల ఫోరం రూపొందిస్తుంది. వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్నమహిళలతో "తరుణీ - ఈ తరం, ఆ తరం"  అనే కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారు. వివరాలకు- tana2015.org/committee/womens-forum-committee.html

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments