Webdunia - Bharat's app for daily news and videos

Install App

20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 రోజుల్లో...

Webdunia
మంగళవారం, 9 జూన్ 2015 (20:38 IST)
20వ తానా మహాసభలకి మనం ఎందుకు రావాలి  - తాన మహాసభల ప్రత్యేకతలు.
“ సేవ, సంస్కృతికి జీవం, సమైక్యత బలం “ తానా సభల ధ్యేయం.
• జూలై 2,3,4 తేదీలలో నిర్వహించబడే 20వ తానా మహా సభలు తెలుగు వారి సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవనున్నాయి. 
• తెలుగు తేజాలను తెలుగు జాతి సమక్షంలో సత్కరించుకొనే అపూర్వ వేదికలు తానా మహా సభలు.
• తెలుగు సాహితీ, సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి జాతి ఔన్నత్యాన్ని దశ దిశలా చాటే కాంతి పుంజాలు - ద్వైవార్షిక తానా మహా సభలు   
• దశాబ్ద కాల విరామం తరువాత డిట్రాయిట్ వేదికగా  జరగబోయే ఈ వేడుకలు ప్రవాస తెలుగు వారందరికీ సుమధుర మధురానుభూతుల సమాహారాలు.
• ఏడుకొండల వాడిని నిరంతరం అర్చించే అర్చక స్వాముల చేత జరుపబడే పూజా కార్యక్రమాలతో, షిర్డీ సాయినాథుడి సేవలో అనవరతం తరించే పూజారుల భక్తి కార్యక్రమాలతో అలరారే  ఆధ్యాత్మిక వైభవాల సుమ గంధాల గుబాళింపు ఈ తానా వేడుక!
• తెలుగు సాహితీ వైభవానికి పట్టం కట్టి, భాషా సేవలో తరించే శ్రీ మేడసాని మోహన్ గారి సాహిత్యావధానం, ప్రాచీన భాషగా గుర్తింపబడ్డ తెలుగు భాష వైభవాన్ని నలువైపులా చాటే సమ్మోహనాస్త్రం !  
• ప్రముఖ పత్రికా సంపాదకులతో  ముఖాముఖి, సినీ కళాకారుల సందడి, రాజకీయ వేత్తల ఉద్వేగభరిత సందేశాల మేలు కలయిక మన తానా సభలు
• మణిశర్మ సంగీత విభావరి, శివారెడ్డి మిమిక్రీ, ప్రముఖ వ్యాఖ్యాతలు సుమ, ఝాన్సీల వ్యాఖ్యానం  ప్రత్యేక ఆకర్షణలు.
• విజయవాడ సిద్ధార్ధ కళాశాల డ్రమ్మర్స్ కార్యక్రమం, డిట్రాయిట్ యూత్ షో, ఎబిలిటీ అన్ లిమిటెడ్ వారిచే ( ప్రత్యేక శక్తి సామర్ద్యం శక్తి సామర్థ్యాలు కలవారిచే)  ఎన్నెన్నో  అలరించే కార్యక్రమాలు.
• TV5 వారి సహకారంతో నిర్వహించబోయే పేరిణి నృత్యం , వీనులవిందైన సంగీతం, ఇంకా, కనువిందు చేసే తానా ప్రధాన వీధిపై నిర్వహించబడే చర్చలు, గోష్టులలో పాల్గొనగలిగే అపూర్వ అవకాశం  
• జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనిర్వహించ బడే  క్రికెట్ లీగ్ పోటీలు, టెన్నిస్, వాలీబాల్ , బాడ్మింటన్, చదరంగం పోటీలు ప్రపంచ యువ క్రీడాకారుల ప్రతిభా పాటవ విన్యాసాల అపురూప తోరణాలు - మన తానా వేడుకలు 
• TV9 వారితో తానా సంయుక్తంగా నిర్వహిస్తున్న “ధిం తానా” , అమెరికా కెనడా లో 16 నగరాలలో నృత్యాలు, పాటల పోటీలు, మిస్ టీన్, మిస్ తానా, మిసెస్ తానా ఫైనల్స్ చూసే అవకాశం. 
• యువతను ఆకర్షించే ప్రత్యేక కార్యక్రమాలు, మహిళా సమస్యలపై చర్చలు
•  రైతన్నల సంక్షేమార్థం జాతీయ , అంతర్జాతీయ శాస్త్రజ్ఞులతో సమావేశాలు. వ్యవసాయ విభాగం ద్వారా ముందెన్నడూ జరగని విధంగా అన్నదాత సౌభాగ్యం  కొరకు ప్రముఖులతో సమావేశాలు.
• తెలుగువారికే స్వంతమైన షడ్రుచుల వంటకాలతో, ఏ పూటకు ఆ పూటే చవులూరించే మృష్టాన్న భోజనాల రుచులతో,  ఆహుతులకు ఒక చెరగని స్మృతిని మిగిల్చే విందులు మన తానా మహా సభలు
• మేధావులు, రాజకీయ ప్రముఖులు, కళాకారులు, రచయితలు, యువత , మహిళా మణుల అపురూప   సంగమం ఈ మహాసభలు.  
• ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాలు,సాహితీ వేత్తల అవధానాలు, తెలుగు ఛందస్సు మీద విశిష్ట మైన చర్చలు వినడానికి ఇంతకన్నా అవకాశం  అమెరికాలో ఉంటూ వస్తుందంటారా?
• భావి తరాల వారిని తెలుగు సంస్కృతీ, సాంప్రదాయలకు దగ్గర చేసి, యువతను మన వారసత్వ సంపదగా తీర్చిదిద్దగలిగే అనేక కార్యక్రమాల సుమహారాల మాలిక, మన తానా సభలు 
• వివాహ వేదికలు, వస్తు ప్రదర్సనలు, విక్రయ దారుల క్రయ విక్రయాలు, ఇంకా ఎన్నెన్నో వినూత్నమైన కార్యక్రమాలు.
• సేవ, సంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య వైభవం డిట్రాయిట్ లో జరగనున్న 20 వ తానా మహాసభల చిరునామా.
 
రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి లక్కీ డ్రాలో పట్టుచీర గెలిచే అవకాశం వినియోగించుకోండి. తానా మహాసభలకు విచ్చేయండి, తానా ఆతిధ్యం స్వీకరించండి, తానా మహాసభలను జయప్రదం చేయండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments