Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం

Webdunia
హూస్టన్‌లోని రైస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తగా ఉన్న భారతీయ అమెరికన్ క్రిష్ణ పాలెంను అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ)" కంప్యూటర్ సొసైటీ క్రిష్ణకు "వాలస్ మెక్‌డోవెల్" అవార్డును బహూకరించింది.

" ఎమ్‌బెడెడ్ కంప్యూటింగ్"లో క్రిష్ణ అందించిన సేవలకుగానూ 2008 సంవత్సరానికి ఐఈఈఈ వాలస్ పురస్కారానికి ఎంపిక చేసింది. మైక్రో ప్రాసెసర్ సృష్టికర్త ఫెడెరికో ఫాగిన్, వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బెర్నర్స్-లీ లాంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకోగా, తాజాగా క్రిష్ణ ఆ ఘనతను సొంతం చేసుకున్నారు.

క్రిష్ణ సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ విశ్వ విద్యాలయం (ఎన్‌టీయూ)లో "ఇనిస్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ నానో ఎలక్ట్రానిక్స్" విభాగం అధిపతిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన కృషితో కార్లు, పిల్లలాడుకునే బొమ్మల్లోనూ ఉంచే కంప్యూటర్ల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.

క్రిష్ణ పాలెం సాగించిన పరిశోధనలు కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. 2007లో ఆయన రైస్ యూనివర్సిటీలో చేరారు. డిజైన్, ప్రొడక్షన్ ఖర్చు తగ్గింపు, తక్కువ విద్యుత్ వినియోగంతో నడిచే మైక్రో చిప్ తయారీ లాంటి లక్ష్యాలతో రైస్, ఎన్టీయూ సంయుక్త భాగస్వామ్యంతో పరిశోధనలు గావిస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments