వీకెండ్ స్పెషల్ : వెరైటీ మసాలా చేపలు పులుసు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2015 (18:55 IST)
అసలే ఎండలు.. చికెన్ వద్దు బాబోయ్ అనుకుంటున్నారా? అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపల్ని ఎంచుకోండి. చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలున్నాయి. వీటిని రోస్ట్‌లా కాకుండా పులుసుతో వీకెండ్ లంచ్ చేయండి. 
 
వెరైటీ చేపలు పులుసుకు కావలసిన పదార్థాలు:
చేపలు - అరకేజీ 
చింతపండు - కొద్దిగా
పచ్చిమిర్చి తరుగు- రెండు టీ స్పూన్లు 
ఉల్లి తరుగు - పావు కప్పు 
కారం - ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
యాలకులు, లవంగం, దాల్చిన చెక్క- ఒక స్పూన్ 
వెల్లుల్లి, అల్లం పేస్ట్ - ఒక టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్ 
గసగసాల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం : 
ముందుగా గ్రేవీ బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసిన చేపముక్కలు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కారం, ధనియాలపొడి, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. తర్వాత మరో పాన్‌లో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగం, యాలకుల పేస్ట్‌ను వేసుకోవాలి. ఇందులోనే చేపల ముక్కల మిశ్రమాన్ని కలపాలి.

మంటను బాగా తగ్గించి చేప ముక్కల్ని కాసేపు ఉడికించాలి. ఉడికే ముందుగానే కొద్దిగా ఉప్పు కూడా చేర్చి పెట్టుకోవాలి. ఈ గ్రేవీ మరి చిక్కగా కాకుండా మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి. చేపలు ఉడికిన తర్వాత కరివేపాకు, చింతపులుసు పోసి ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఫిష్ కర్రీ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కూకట్‌పల్లిలో ఒక భారీ దోపిడీ.. కంట్లో కారం చల్లి రూ.1కోటి దోచుకెళ్లారు..

Donald Trump: ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని భావించడం లేదు

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 400మంది మృతి.. తాలిబన్

మిత్రులు రమ్మంటే రావడంలేదు, మాకు కావల్సినంత ఆయిల్ వుంది, మీరెట్లా పోతే మాకేం: ట్రంప్

సినీ నటి ప్రత్యూష కేసు.. 24ఏళ్ల తర్వాత లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jana Nayagan: జన నాయగన్ రిలీజ్.. పవన్ చెప్పినట్టే జరుగుతోంది... ఏంటది?

జన నాయగన్ సినిమా రిలీజ్‌.. నిర్మాతలదే తప్పు.. ఎన్డీఏది కాదు: పవన్ కల్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆసక్తికర సన్నివేశాలు.. మహేష్ క్లారిటీ (video)

Suriya: ఎమోషనల్ డ్రామాగా సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ టీజర్

Anand Deverakonda: ఎపిక్ మూవీ ప్రోమో - రావులపాలెంలో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు

Show comments