Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండూరి చికెన్ ఇంట్లోనే ట్రై చేయండి!

Webdunia
బుధవారం, 13 మే 2015 (18:36 IST)
అసలే వేసవి సెలవులు. పిల్లలకు చికెన్ కూరలు, ఫ్రైలతో బోర్ కొట్టిస్తున్నారా? అయితే తండూరి చికెన్ ట్రై చేయండి. ఇంట్లోనే తండూరి ట్రై చేస్తే పిల్లలకు, పెద్దలకు హెల్దీ రిసిపీని అందించినట్లవుతుంది. మరి తండూరి చికెన్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
చికెన్ ముక్కలు - ఒక కేజీ 
కారం - ఒకటిన్నర స్పూన్ 
నిమ్మరసం - రెండు స్పూన్లు
ఉప్పు - తగినంత 
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు 
చాట్ మసాలా - ఒక స్పూన్ 
 
నానబెట్టేందుకు..
అల్లం పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు 
వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు 
పెరుగు - ఒక కప్పు 
నిమ్మరసం - ఒక టీ స్పూన్ 
ఉప్పు - తగినంత 
నూనె- రెండు టీ స్పూన్లు 
గరం మసాలా - ఒక టీ స్పూన్ 
వెన్న- రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం : 
చికెన్ ముక్కలను శుభ్రం చేసుకుని వాటిని తండూరి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు ముక్కలకు పట్టించి అరగంట పాటు ఫ్రిజ్‌లో వుంచాలి. పెరుగును పల్చని వస్త్రంలో వుంచి 20 నిమిషాల పాటు హ్యాంగ్ చేస్తే నీరంతా పోతుంది. దీనికి అల్లం, వెల్లుల్లి పేస్టులు కారం, ఉప్పు, నిమ్మరసం, గరంమలాలా వంట నూనెల్ని కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకి పట్టించి 3-4 గంటలు ఫ్రిజ్‌లో వుంచాలి. ఓవెన్ ఉపయోగించేటట్లయితే 200 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతపై ముందుగా వేడిచేసుకోవాలి. 10-12 నిమిషాల వరకు ఉడికేంతవరకు ఉంచాలి. లేదా పెనంపై నేరుగా కాల్చుకోవాలి. వెన్నరాసి నాలుగైదు నిమిషాలు ఉంచాలి. గరం మసాలా చల్లి, ఉల్లి చక్రాలు.. నిమ్మ చక్రాలతో అలంకరించి.. సర్వ్ చేయాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments