Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోంగూరతో చికెన్ ఫ్రై ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 18 మార్చి 2015 (17:23 IST)
గోంగూరతో చికెన్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది.. పుల్ల పుల్లగా టేస్టీగా ఉందంటూ లాగించేస్తాం కదూ.. అయితే ఇంట్లోనే గోంగూర చికెన్ డ్రై ఫ్రై ట్రై చేయండి. ముఖ్యంగా గోంగూర ఆకుల్లో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది,. ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తినకుండా మితంగా తినడం మంచిది.
 
చికెన్ : ఒక కేజీ 
గోంగూర ఆకులు : ఒక కప్పు 
ఉల్లిపాయ తరుగు : అర కప్పు 
పుదీనా ఆకులు :  అరకప్పు 
ఎండుమిర్చి : పది 
కారం: అర స్పూన్ 
ఉప్పు : రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లిపేస్ట్: ఒక టీ స్పూన్ 
మసాలా పొడి : ఒక టీ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
ఆయిల్ : తగినంత 
కొత్తిమిర : కొద్దిగా 
నీళ్ళు : కొద్దిగా చికెన్ ఉడికించుకోవడానికి 
 
తయారీ విధానం: 
ముందుగా మిక్సీలో ఎండుమిర్చి, కొత్తిమీరను మెత్తగా రుబ్బి పక్కనబెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో ఉడికించి పక్కనబెట్టుకోవాలి. బాణలి వేడయ్యాక నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలి.

ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో గోంగూర ఆకలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పేస్ట్ చేసిపెట్టుకొన్న ఎండిమిర్చి కొత్తిమీర పేస్ట్‌ను అందులో వేసి ఫ్రై చేయాలి. ఈ మిశ్రమం మాడిపోకుండా కొద్దిగా నీళ్ళు పోసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉడికించి పెట్టుకున్న చికెన్‌ను కలుపుకోవాలి. చికెన్‌తో పాటు, ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే గోంగూర చికెన్ ఫ్రై రెడీ..

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments