Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైసీ చికెన్ టమోటా కర్రీ టేస్ట్ చేశారా?

Webdunia
గురువారం, 11 డిశెంబరు 2014 (19:08 IST)
స్పైసీ చికెన్ టమోటా కర్రీ.. ఇందులో న్యూట్రీషన్లు పుష్కలంగా ఉంటాయి. టమోటా, చికెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ-యాక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 
 
స్పైసీ చికెన్ టమోటా కర్రీ ఎలా చేయాలంటే..?
కావల్సిన పదార్థాలు: 
చికెన్ : రెండు కప్పులు
రెడ్ చిల్లీ పేస్ట్ : రెండు టీ స్పూన్లు 
టమోటో గుజ్జు : ఒకటిన్నర కప్పు 
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: కొద్దిగా 
చింతపండు గుజ్జు: రెండు టీస్పూన్లు 
కొబ్బరి నూనె: ఒక టేబుల్ స్పూన్ 
బంగాళదుంపలు: ఒక కప్పు 
ఉల్లిపాయలు: అరకప్పు 
వెల్లుల్లి రెబ్బలు: పావు కప్పు
కరివేపాకు: కొద్దిగా 
జీలకర్రపొడి: ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం: ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి అందులో పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన బెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత పాన్‌లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేపుకోవాలి. ఇందులో ఉల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. జీలకర్ర పొడి, ఉప్పు కూడా వేసి ఒక నిముషం వేగించాలి. 
 
తర్వాత టమోటో పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ 10 నిముషాలు ఉడికించుకోవాలి. పదినిముషాల తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు ఉడికించాలి. టమోటో గ్రేవీ చిక్కగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి మొత్తం మిక్స్ చేసి మూత మూయాలి. 
 
మంటను పూర్తిగా తగ్గించి 10నిముషాలు ఉడికించుకోవడం వల్ల మసాలాలు చికెన్‌కు బాగా పడుతాయి. చివరగా చింతపండు గుజ్జును ఉడుకుతున్న టమోటో చికెన్ గ్రేవీలో పోసి బాగా మిక్స్ చేసి ఒక నిముషం తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రిసిపీ వేడి వేడి అన్నంలోనికే కాదు.. రోటీలకు కూడా సైడిష్‌గా టేస్టీగా ఉంటుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments