Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే చీజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో తెలుసా?

ముందుగా ఓ బౌల్‌లో కోడిగుడ్లను పగుల కొట్టి బాగా గిలకొట్టుకోవాలి. అందులోనే కాసింత ఉప్పు, పసుపు చేర్చి మరోసారి గిలకొట్టాలి. తర్వాత పాన్‌లో నూనె పోసి ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆపై గరంమసాలా,

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:35 IST)
కోడిగుడ్డు, చీజ్ పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. చీజ్ పిల్లలకు ఇవ్వడం ద్వారా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే చీజ్‌ను మితంగానే వాడాలి. అలాగే కోడిగుడ్డును రోజుకొకటి తీసుకుంటే.. ఓ రోజు సరిపడా శక్తిని అందిస్తుంది. అందుకే ఈ రెండింటి కాంబోలో వంటకాలు పిల్లలకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. సో వేసవి సెలవుల్లో ఇంట్లో వున్న మీ పిల్లలకు స్నాక్స్‌గా చీజ్ ఆమ్లెట్ ట్రై చేయండి.
 
కావలసిన పదార్థాలు : 
చీజ్ - అర కప్పు 
కోడిగుడ్డు - ఐదు 
గరంమసాలా - పావుటీస్పూను, 
క్యాప్సికమ్ ముక్కలు - పావుకప్పు 
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
నూనె, ఉప్పు - తగినంత 
పసుపు - చిటికెడు, 
 
తయారీ విధానం:
ముందుగా ఓ బౌల్‌లో కోడిగుడ్లను పగుల కొట్టి బాగా గిలకొట్టుకోవాలి. అందులోనే కాసింత ఉప్పు, పసుపు చేర్చి మరోసారి గిలకొట్టాలి. తర్వాత పాన్‌లో నూనె పోసి ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆపై గరంమసాలా, పసుపు, కారం, కొత్తిమీర తురుము, అన్నీ వేసి కలిపి వేయించి తీసి గిలకొట్టిన గుడ్డుసొనలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోయాలి. రెండువైపులా కాలాక ఒకవైపున చీజ్‌ తురుము చల్లి అది కరిగేవరకూ సిమ్‌లో ఉంచి దించాలి. అంతే చీజ్ ఆమ్లెట్ రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments