Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 13 జూన్ 2015 (18:29 IST)
రోస్టెడ్ చికెన్‌కు లెమన్ జోడిస్తే ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లెమన్ క్యాలరీలను కరిగిస్తుంది. చికెన్ బరువును తగ్గించేందుకు ఉపయోగపడటంతో పాటు ప్రోటీన్స్‌ను అందిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్‌లో  రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
రైస్ - రెండు కప్పులు 
బోన్ లెస్ చికెన్ - అరకేజీ 
నిమ్మరసం-  నాలుగు స్పూన్లు 
పసుపు - అర టీ స్పూన్ 
కరివేపాకు తరుగు - కాసింత 
ఉల్లి తరుగు - అరకప్పు 
ఆవాలు - తాలింపుకు తగినంత 
పచ్చిమిర్చి ముక్కలు - ఒక స్పూన్ 
నూనె, ఉప్పు - రుచికి సరిపడా 
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌కు ఉప్పు, పెప్పర్ వేసి ఉడికించి రోస్ట్ చేసుకోవాలి. లేదా గ్రిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసి వేయించాలి. అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక సెకను వేగించుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేపుకోవాలి. 
 
పెప్పర్ రోస్ట్ చేసిన అందులో పెప్పర్ రోస్ట్ చేసి బోన్ లెస్ చికెన్ వేసి పోపుతో పాటు వేపాలి. పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఫ్రై చేసుకోవాలి.  మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి రుచికి సరిపడా ఉప్పు చిలకరించి మిక్స్ చేయాలి. చివరగా ఫ్రైడ్ రైస్ మొత్తం మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు ఉండనిచ్చి దించేయాలి. అంతే రోస్టెడ్ చికెన్‌ రైస్ రెడీ అయినట్లే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments