రంజాన్ స్పెషల్ "దమ్ కా బిర్యాని"

Webdunia
గురువారం, 24 జులై 2014 (17:49 IST)
ఈ నెల 29న రంజాన్ పండుగ. రంజాన్ అంటేనే ముస్లిం సోదరులు బిర్యానీ చేసేస్తారు. వారికోసం రంజాన్ స్పెషల్‌గా దమ్ కా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: చికెన్ - ఒక కిలో, బాస్మతి బియ్యం - ఒక కిలో, గరం మసాల - రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, పెరుగు - ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, పచ్చి మిరపకాయలు - ఐదు, ఎండు మిరపకాయలు - ఆరు, పసుపు - చిటికెడు, కొత్తమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
 
తయారు చేసే విధానం: ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతుల నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి. 
 
పొయ్యి మీద మరో పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్రలో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి.
 
పాత్ర నుంచి ఆవిరి బయటకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించుకోవలి. దీనికి సైడ్ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను వేసి సర్వ్ చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెన్నై-హౌరా రైలు కింద పడి ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య

పాకిస్తాన్‌తో ఉగ్రవాద సంబంధాలు.. ముగ్గురు వైజాగ్ వ్యక్తుల అరెస్ట్

పులిని పట్టుకునేందుకు అటవీ అధికారుల ప్రయత్నాలు

14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం.. పదే పదే లైంగిక దాడి- 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కరణ : రూ.761 కోట్లు దాటిన 'ధురంధర్ : ది రివెంజ్'

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Show comments