"మలాయ్‌ రొయ్యల కర్రీ" విత్ మిల్క్ క్రీమ్..!

Webdunia
బుధవారం, 10 సెప్టెంబరు 2014 (15:49 IST)
కావలసిన పదార్థాలు :
తాజా పచ్చి రొయ్యలు.. అర కిలో
ఉల్లిపాయలు.. ఆరు
అల్లంవెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
టొమోటో పేస్ట్.. రెండు కప్పులు
మిల్క్ క్రీమ్.. ఒక కప్పు
కారం, నూనె.. సరిపడా
కసూరి మేథీ.. ఒక టీ.
పచ్చిమిర్చి.. 8
కొత్తిమీర.. ఒక కట్ట
వెల్లుల్లి.. 4 రెబ్బలు
అల్లం ముక్కలు.. కొద్దిగా
జీడిపప్పులు.. ఆరు
గరం మసాలా.. 2 టీ.
ఉప్పు.. సరిపడా
 
తయారీ విధానం :
పచ్చి రొయ్యలను శుభ్రం చేసి వాటికి ఉప్పు, కారం కలిపి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక అందులో రొయ్యల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముద్దను వేసి కాసేపు వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. తరువాత కారం, పచ్చిమిర్చి ముద్ద.. అల్లం, వెల్లుల్లి తరుగులను కూడా వేసి కలిపి వేయించాలి. చివరిగా టొమోటో పేస్ట్‌ను కలిపి వేసి, కలియబెట్టి ఉడికించాలి. 
 
కాసేపటి తర్వాత వేయించి ఉంచిన రొయ్యలను వేసి, ఉప్పు సరిజూసుకుని సన్నటి మంటపై ఉడికించాలి. తరువాత కసూరి మేథీ, గరంమసాలా, జీడిపప్పులను వేసి బాగా కలియబెట్టి మరికాసేపు ఉడికించాలి. చివరగా కూర కిందికి దించేముందు మిల్క్ క్రీమ్ కలపాలి. సర్వింగ్ చేసే ముందు కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి. అంతే ఘుమఘుమలాడే మలాయ్ ప్రాన్ కర్రీ సిద్ధం. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వృద్దాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగి జీతంలో కోత

మా పవర్ ప్లాంట్‌పై ఒక్క బాంబు పడిందో.. గల్ఫ్ దేశాల్నీ అంధకారంలోకి వెళతాయి : ఇరాన్ వార్నింగ్

ఏపీ వాసులకు చేదు వార్త... పిడుగులతో కూడిన వర్షం

హర్మూజ్ జలసంధిని దాటిన మరో భారత ఎల్పీజీ నౌకలు

గ్రీన్‌ల్యాండ్ కాపాడమని యూరప్ దేశాలు మమ్నల్ని అడిగితే ట్రంప్‌ను తరిమికొడతాం: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: మోదీజీకి గర్వించదగిన అంధభక్తురాలిని.. ధురంధర్‌పై రేణు దేశాయ్ సమీక్ష

బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తున్న స్పై థ్రిల్లర్ 'ధురంధర్ : ది రివెంజ్'

రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్?

Rajiv Kanakala: ఆహ్లాదకరమైన మ్యూజిక్ తో ఊరి కథలా తెరచాప ట్రైలర్

Ram Charan: పెద్ది అప్ డేట్: రామ్ చరణ్ బర్త్ డే నాడు పెద్ది క్యారెక్టర్ పోస్టర్, బుకింగ్స్ ఓపెన్

Show comments