Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు మేలు చేసే పనీర్ మటన్ గ్రేవీ ఎలా చేయాలి?

పనీర్ మటన్ గ్రేవీ ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (15:59 IST)
పనీర్‌లోని క్యాల్షియం, మటన్‌లోని ఐరన్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్‌లో గ్రేవీ ట్రై చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 

కావలసిన పదార్థాలు: 
మటన్‌: అరకిలో
ధనియాలపొడి: టేబుల్‌స్పూను, 
గరంమసాలా: అరటీస్పూను, 
కరివేపాకు: 2 రెబ్బలు, 
నూనె: 3 టేబుల్‌స్పూన్లు
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు,
టొమాటో తరుగు : ఒక కప్పు 
దోరగా వేయించిన పనీర్ ముక్కలు : ఒకటిన్నర కప్పు 
అల్లం వెల్లుల్లి ముద్ద : ఒక టేబుల్ స్పూన్ 
కారం, ఉప్పు, నూనె : తగినంత
 
తయారీ విధానం:
ముందుగా మటన్‌ను శుభ్రంచేసి కాస్త పసుపు, ఉప్పు చేర్చి కుక్కర్లో ఉడికించి పక్కనబెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు చేర్చి దోరగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేసి రెండు నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత ఉడికించిన మటన్ ముక్కల్ని చేర్చి.. అందులో ధని లపొడి, సన్నగా కోసిన టొమాటోముక్కలు వేసి కలపాలి.

టొమాటోలు మెత్తబడ్డాక కప్పు నీళ్లు పోసి ముక్క మెత్తబడేవరకూ ఉడికించాలి. మటన్‌ పూర్తిగా ఉడికి నూనె తేలాక గరంమసాలా వేసి కలపాలి. ఇందులో పనీర్ చేసి ఐదు నిమిషాలుంచి.. చివరగా కొత్తిమీరతో అలంకరించి దించాలి. అంతే పనీర్ మటన్ గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీ రోటీలకు, వేడి వేడి అన్నంలోకి మంచి రుచినిస్తుంది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments