Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ కర్రీ ఎలా చేయాలి?

Webdunia
శుక్రవారం, 15 మే 2015 (18:00 IST)
మటన్‌లో బి విటమిన్, విటమిన్ కె, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, మినరల్స్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మటన్ కొలెస్ట్రాల్ లెవల్‌ను సక్రమంగా ఉంచుతుంది. హృద్రోగ వ్యాధులను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాంటి మటన్‌తో కర్రీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మటన్ - అరకేజీ 
దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అల్లం ముక్ పేస్ట్ - రెండు స్పూన్లు 
కొబ్బరి పాలు - అర కప్పు, 
మిరియాల పొడి - ఒక టీ స్పూన్
నూనె, ఉప్పు - తగినంత 
 
నానబెట్టేందుకు.. అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ స్పూన్
నిమ్మరసం - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలకు ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు నిమ్మరసం కలిపి 20 నిమిషాలసేపు నానబెట్టాలి. నూనె వేడిచేసి దాల్చినచెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి, ఉల్లి, టమోటా అరకప్పు చేర్చి వేగాక మటన్ ముక్కల్ని బాగా ఉడికించాలి. 
 
తర్వాత కొబ్బరి పాలు పోసి మాంసాన్ని మెత్తగా ఉడక నివ్వాలి. తర్వాత మిరియాలపొడిని కలపాలి. ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి, వేడివేడిగా వడ్డించాలి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments