వీకెండ్ స్పెషల్ : మస్టర్డ్ చికెన్ కర్రీ

Webdunia
శనివారం, 21 జూన్ 2014 (16:29 IST)
ఈ వీకెండ్ మస్టర్డ్ చికెన్ కర్రీ ట్రై చేయండి. సాధారణ ఆయిల్‌ కాకుండా మస్టర్డ్ పేస్ట్‌తో పాటు, మస్టర్డ్ ఆయిల్‌ను ఉపయోగించి చికెన్ చేయడం ద్వారా పిల్లలు తెగ ఇష్టపడి తింటారు. ఆవగింజలు బరువు తగ్గడానికి తోడ్పడతాయి. విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా కలిగే ఆవగింజలతో వంటకాలు, ఆవనూనెతో వేపుళ్లు చేయడం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
 
ఓకే ఇక ఆవగింజల పేస్ట్ (మస్టర్డ్ పేస్ట్)‌తో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు
చికెన్: ఒక కేజీ 
మ్యారినేషన్ కోసం.. నిమ్మరసం- రెండు టేబుల్ స్పూన్లు, 
అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ పేస్ట్- మూడు టేబుల్ స్పూన్లు 
పెరుగు - అర కప్పు
ఆవాలు ఆయిల్ - ఒక టేబుల్ స్పూన్
కారం - ఒక టేబుల్ స్పూన్ 
వైట్ ఆవాలు - నాలుగు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - నాలుగు 
ఉప్పు: రుచికి సరిపడా 
 
గ్రేవీకోసం కావాల్సిన పదార్థాలు: 
 
ఆవనూనె: పావు కప్పు 
పంచదార - ఒక టీస్పూన్ 
ఉల్లి తరుగు - పావు కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ 
కారం - ఒక టీ స్పూన్ 
వైట్ మస్టర్డ్ - రెండు టేబు స్పూన్లు 
ఉప్పు - తగినంత 
సరిపడా- వెచ్చని నీరు - మూడు కప్పులు 
 
తయారీ విధానం:
ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు ఆవగింజల పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌తో పాటు మ్యారినేషన్ కోసం లిస్ట్‌లో సిద్ధంగా ఉంచుకొన్నా పదార్థాలన్నింటినీ కూడా వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. అవసరమైతే కాసింత నీరు కూడా కలుపుకోవచ్చు. మ్యారినేషన్ చేసిన చికెన్ ముక్కలను గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
 
గంట తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి అందులో మస్టర్డ్ ఆయిల్ పోసి కాగాక పంచదార వేయాలి. ఇది నూనెలో పాకంలా తయారయ్యాక మంట తగ్గించాలి. పంచదార కరిగే వరకూ, కలర్ బ్రౌన్ కలర్ మారే వరకూ కలియబెడుతుండాలి. ఇందులో ఉల్లి ముక్కలేసి దోరగా వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి.
 
తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసి 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, రెండు టీస్పూన్ల్ వైట్ మస్టర్డ్ పేస్ట్, ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేపాలి. అందులో గోరువెచ్చని నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పాన్‌కు మూత పెట్టి 20నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని వేడివేడి రైస్ లేదా రోటీలకు సైడిష్‌గా మస్టర్డ్ చికెన్ కర్రీ సర్వ్ చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

Show comments