Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్ స్పెషల్: మష్రూంతో ఆమ్లెట్

Webdunia
శనివారం, 31 మే 2014 (13:05 IST)
వీకెండ్ స్పెషల్ మష్రూంతో ఆమ్లెట్ ట్రై చేయండి. ఈ ఆమ్లెట్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మష్రూం, కోడిగుడ్డులోని పోషకాలు పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇంకా మహిళలకు మష్రూమ్ ఎంతో మేలు చేస్తుంది. గర్భసంచికి ఎంతో మేలు చేసే మష్రూమ్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఐరన్, క్యాల్షియం, తక్కువ కెలోరీలను డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కూడా తీసుకోవచ్చు. అలాంటి మష్రూమ్‌తో ఆమ్లెట్ ట్రై చేసి చూడండి.  
 
కావలసిన పదార్థాలు : 
సన్నగా తరిగిన బటన్ మష్రూంలు - నాలుగు టేబుల్ స్పూన్లు, 
కోడిగుడ్లు - నాలుగు,
తరిగిన ఉల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్, 
తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, 
మిరియాల పొడి - మూడు టేబుల్ స్పూన్లు, 
కొత్తిమీర తురుము - కాస్త, 
ఉప్పు - తగినంత, 
నూనె - మూడు టేబుల్ స్పూన్లు.
 
తయారు చేయు విధానం :
బాణాలిలో చెంచా నూనె వేస కాగాక, అందులో బటన్ మష్రూం ముక్కలను వేసి వేగాక దించేయండి. కోడిగుడ్డును పగులగొట్టి దానిని కాస్త గిలకొట్టి ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పులను వేసి కలపాలి. 
 
తర్వాత పెనాన్ని పొయ్యి మీద పెట్టి వేడయ్యాక, దానిపై నూనె రాసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిపైన వేయించి పెట్టుకున్న బటన్ మష్రూం ముక్కలను వేసి ఉడికించాలి. రెండు వైపులా కాల్చి దించి వేడిగా సర్వ్ చేయండి.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments