Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ స్పెషల్.. వీకెండ్ ట్రీట్ మటన్ మసాలా!

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (18:27 IST)
హైదరాబాద్ స్పెషల్.. మటన్ మసాలాను ఈ వీకెండ్ ఇంట్లోనే ట్రై చేద్దామా.. మటన్‌లో మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పెద్దలు కూడా మాసానికి రెండు సార్లు లేదా ఒక్కసారి మటన్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు మటన్ మసాలా లాంటి వెరైటీలు ట్రై చేస్తే లొట్టలేసుకుని తినేయవచ్చు. ఇక హైదరాబాద్ స్టయిల్‌లో మటన్ మసాలా ఎలా చేయాలంటే..
 
కావలసిన పదార్థాలు: 
లేత వేట మాంసం : అర కేజీ  
పెరుగు: ఒక కప్పు 
మిరియాల పొడి : ఒక టీ స్పూన్  
ఉల్లిపాయ తరుగు : అర కప్పు 
వెల్లులి పేస్ట్ : ఒక స్పూన్ 
లవంగాలు: 5 
ఏలకలు: 4 
జీలకర్ర : ఒక టీ స్పూన్ 
పలావ్ ఆకు: ఒకటి  
కారం: ఒక టీ స్పూన్ 
జీలకర్ర పొడి: రెండు టీ స్పూన్లు
నూనె, ఉప్పు : తగినంత 
అల్లం పేస్ట్ : ఒక స్పూన్ 
పచ్చిమిర్చి పేస్ట్ : రెండు స్పూన్లు 
పెప్పర్ కార్న్స్: 10 
 
తయారీ విధానం :
మాంసాన్ని ముందుగా శుభ్రం చేసుకుని.. వాటికి పెరుగు కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి మిక్స్ చేసి రెండున్నర గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నూనె పోసి వేడయ్యాక పలావ్ ఆకు, జీలకర్ర, పెప్పర్ కార్న్, లవంగాలు, ఏలకలు వేసి రెండు నిమిషాల పాటు వేపుకోవాలి. ఇందులో ఉల్లి తరుగు వేసి దోరగా వేపాలి. 
 
ఇందులో వెల్లుల్లి అల్లం పేస్ట్ కలిపి రెండు నిమిషాలు వేపాలి. ఈ మిశ్రమాన్ని నానబెట్టిన మటన్‌తో కలుపుకుని కుక్కర్లో  రెండు కప్పుల నీటిని జోడించి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మటన్ బాగా ఉడికాక రెడీ అయిన మటన్ మసాలాను వేడి వేడి రైస్‌, బిర్యానీ లేదా రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments