Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ వడలు చాలా టేస్ట్... ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:31 IST)
వడలు మినప్పప్పు, పెసరపప్పులతోనే కాదు చికెన్‌తోనూ చేసుకోవచ్చు. సాయంత్రం వేళ చికెన్ వడలు తింటూ ఎంజాయ్ చేయండి. ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావాల్సిన పదార్థాలు
చికెన్ (బోన్లెస్) - అరకిలో,
కొబ్బరి తురుము - అరకప్పు, 
ఉల్లి తరుగు - అర కప్పు,
పచ్చి మిర్చి - నాలుగు,
దాల్చిన చెక్క - చిన్న ముక్క,
గోధుమ రవ్వ - చెంచా, 
లవంగాలు - రెండు,
కరివేపాకు - రెండు రెబ్బలు,
అల్లం తరుగు - ఒక చెంచా,
నూనె - సరిపడినంత,
ఉప్పు - తగినంత.
 
తయారు చేసుకునే విధానం
చికెన్ శుభ్రంగా కడిగి తడి లేకుండా వార్చేయాలి. పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ (చికెన్‌తో సహా) మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. మరీ గట్టిగా ఉంటే కాస్త నీరు చేర్చి మిక్సీ వేయాలి. ఆ రుబ్బుని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. అందులో చికెన్ రుబ్బుని వడల్లా అద్ది నూనెలో వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే.. చికెన్ వడలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments