హనీ చిల్లీ చికెన్ రైస్ ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (19:04 IST)
తేనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గించడంలో, అనవసరపును కొవ్వును కరిగించడంలో తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాంటి తేనెను  చికెన్ కాంబినేషన్‌తో హనీ చిల్లీ చికెన్ రైస్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
బోన్ లెస్ చికెన్ : అర కేజీ 
హనీ : ఒక కప్పు 
ఉడికించిన అన్నం : 3 కప్పులు 
గ్రీన్ చిల్లీ సాస్ : ఒక టీ స్పూన్ 
రెడ్ చిల్లీ సాస్ : ఒక టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
బ్లాక్ పెప్పర్ : ఒక టీ స్పూన్ 
కార్న్ ఫ్లోర్ : ఒక స్పూన్ 
నూనె : తగినంత 
సోయా సాస్ : ఒక టీ స్పూన్ 
ఉల్లి పాయ ముక్కలు : ఒక కప్పు 
గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు : ఒక కప్పు 
క్యాలీ ఫ్లవర్ ముక్కలు : ఒ కప్పు 
కోడి గుడ్లు : నాలుగు 
చికెన్ స్టాక్ : పావు కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ : గార్నిష్‌కు తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసి ఉప్పు, పెప్పర్, సాల్ట్ వేసిన చికెన్‌కు కార్న్ ఫ్లోర్‌తో బాగా మిక్స్ చేయాలి. బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో చికెన్ ముక్కలు గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయాసాస్‌ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో హానీ చేర్చుకుని చికెన్ ముక్కలకు పట్టేంతవరకు బాగా మిక్స్ చేయాలి. మరో బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లి, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా వేపుకోవాలి.

ఈ కూరగాయల ముక్కలతోనే కోడిగుడ్డును కూడా బాగా వేపుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక ఉడికించిన అన్నం, సోయాసాస్, పెప్పర్, ముందుగా వేపుకున్న చికెన్ ముక్కలు వేసి 5 నుంచి పది నిమిషాల దాకా ఫ్రై చేయాలి. తర్వాత సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని ఉల్లితో గార్నిష్‌ చేసి హాట్ హాట్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎపుడైనా.. ఎక్కడైనా.. ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్...

ఐదేళ్ల బాలికపై వీధికుక్క దాడి.. చెంపపై కరిచింది..

లోకేశ్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ : బీద రవిచంద్ర

బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?

ఇంట్లో వాళ్లే నమ్మక ద్రోహం చేశారు.. నా భార్య చాలా మంచిది.. నవ వరుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

అకీరా నందన్‌కు ఊరట... ఏఐ లవ్ స్టోరీపై తాత్కాలిక నిషేధం

Show comments