ఆంధ్రా చేపల పులుసు కంటే గోవా చేపల కూర బాగుంటుందా?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (12:44 IST)
తెలుగు ప్రజలకు ఆంధ్రా చేపల పులుసు అంటే అమితమైన ఇష్టం. అందుకే ఆంధ్రా చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. అలాగే, గోవా ప్రజలకు కూడా ఓ రుచికరమైన కూర ఉంది. అదే గోవా చేపల కూర. ఈ కూరను ఎలా తయారు చేస్తారో ఓసారి తెలుసుకుందాం. 
 
కావల్సినవి:
చేపలు - అరకేజీ, 
కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, 
ఉల్లిపాయలు - 3, 
కారం - 3 టేబుల్‌స్పూన్లు, 
ధనియాల పొడి - అర టేబుల్‌ స్పూను, 
పసుపు - టేబుల్‌ స్పూను, 
మెంతులు - పావు చెంచా, 
కరివేపాకు రెబ్బ- ఒకటి, 
చింతపండు రసం - పావుకప్పు, 
ఉప్పు - తగినంత, 
నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం.. 
బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి కొబ్బరి తురుము, కారం చేర్చాలి. అందులోనే ధనియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. కొబ్బరి బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. పూర్తిగా చల్లారనిచ్చి చింతపండు రసం చేర్చి మెత్తగా చేసుకోవాలి.

ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే పసుపు, సరిపడా ఉప్పు వేసి, మిశ్రమం చిక్కగా అయ్యాక చేప ముక్కల్ని కలపాలి. అవి ఉడికేందుకు సరిపడా నీళ్లు చేర్చి, మంట తగ్గించి మూత పెట్టేయాలి. అంతే చేపల కూర సిద్ధం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments