ఆరోగ్యానికి మేలు చేసే కొరమీను కూరను ఎలా చేయాలి?

చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (16:20 IST)
చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ కొరమీను పులుసు పెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - 1 కిలో
ఉల్లిపాయలు - 2 కప్పులు తరిగినవి
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - కావలసినంత
కారం - రుచికి సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - తగినంత
పచ్చిమిరపకాయలు - 3
ధనియాల పొడి - 1/4 టీ స్పూను
గరం మసాలా - 1/4 టీ స్పూను
కొత్తిమీర , కరివేపాకు రెబ్బలు
 
తయారీ విధానం : 
కొరమీను చేపను కడిగి శుభ్రం చేసుకోవాలి. దానిలో తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి 20 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఓపాత్ర పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. బాగా వేగాక చేప ముక్కలు కూడా చేర్చి 2 నిమిషాలు వేయించి తగిన నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. 
 
చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత దించెయ్యాలి. చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

తర్వాతి కథనం
Show comments