ఫిష్ 65 ఎలా చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 జూన్ 2014 (16:01 IST)
చికెన్ మటన్ కంటే, సీఫుడ్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల గుండెకు చాలా మంచి ఆహారం. చేపలతో వివిధ రకాల వంటలను వండుకోవచ్చు. గ్రేవీ, పులుసు, చేపల వేపుడు, ఫిష్ బిర్యానీ ఇలా వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు. ఫిష్ తో ఫిష్ 65 ట్రై చేసి చూశారా? ఇంకెందుకు ఆలస్యం ఈవెనింగ్ స్నాక్‌గా లేదంటే సైడిష్‌గా కూడా ఫిష్ 65ని ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు :
చేప ముక్కలు : ఆరు 
పెప్పర్ : చిటికెడు 
గుడ్డు : రెండు 
మైదా : రెండు టేబుల్ స్పూన్లు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ 
కారం : రెండు టీ స్పూన్లు 
గరం మసాలా పౌడర్ :  ఒక టీస్పూన్
ధనియాల పొడి : కొద్దిగా 
ఉప్పు,నూనె : తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కల్ని ఓ బౌల్‌లోకి తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత గుడ్డును కూడా పగలగొట్టి, పచ్చసొనతో పాటు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో చేప ముక్కలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయాలి. 
 
ఇలా మసాలా పట్టించిన చేపముక్కలను అరగంట పాటు ఫ్రిజ్‌లో పెడితే మరింత టేస్ట్ ఉంటుంది. అరగంట తర్వాత ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైయింగ్ పాన్‌లో నూనె వేసి, వేడయ్యీక, చేప ముక్కలను నూనెలో వేసి అతి తక్కువ మంట మీద ఇరువైపులా దోరగా వేపుకోవాలి. అంతే ఫిష్ 65 రెడీ.ఈ ఫిష్ 65ని పప్పుచారుకు సైడిష్‌గానూ ఉపయోగించుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

Show comments