వర్షాల్లో ఘాటు ఘాటుగా కోడిగుడ్డు గ్రేవీ టేస్ట్ చేస్తే?

అసలే వర్షాలు.. స్నాక్స్‌కు బదులు పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్లు తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. అలాంటి పోషకాలతో కూడిన ఆహారంలో కోడిగుడ

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (16:47 IST)
అసలే వర్షాలు.. స్నాక్స్‌కు బదులు పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్లు తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. అలాంటి పోషకాలతో కూడిన ఆహారంలో కోడిగుడ్డు కూడా ఒకటి. హైకొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారానికి రెండో మూడో కోడిగుడ్లు మాత్రమే తీసుకోవాలి. కానీ ఎదిగే పిల్లలు రోజుకో గుడ్డు తీసుకోవాలి. ఇందులో విటమిన్ డి, బీ6, బీ12, జింక్, ఐరన్, కాపర్ ఉన్నాయి. అలాంటి కోడిగుడ్డుతో ఘాటు ఘాటుగా కోడిగుడ్డు కూర ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్డు - ఎనిమిది 
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు- ఒక స్పూన్ 
టమోటా తరుగు - అర కప్పు 
పసుపు, కారం, ఉప్పు, నూనె- తగినంత 
ధనియాల పొడి - ఒక స్పూన్ 
చింతపండు గుజ్జు - ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం : 
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక అందులో నూనె వేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగాక వెల్లుల్లి, ఉల్లి ముక్కలు వేసి దోరగా వేపాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ధనియాలపొడి వేసి మరో 3 నిముషాలపాటు ఉడికించాలి.

తర్వాత టమోటా ముక్కలు, చింతపండుగుజ్జు వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. టమోటా గుజ్జు మెత్తబడిన తర్వాత అందులో ఉప్పు కలిపి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఇదే మిశ్రమంలో ఉడికించిన కోడిగుడ్లను చేర్చి.. గ్రేవీలోని మసాలాలో కోడిగుడ్లను ఐదు నిమిషాల పాటు ఉడికేట్లు చేయాలి. గ్రేవీ లా అయ్యాక కూరను దించేయాలి. ఈ గ్రేవీని రోటీలకు అన్నంలోకి సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి.. చంద్రబాబు పిలుపు

సీపీఐ మావోయిస్ట్ పార్టీపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలి.. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?

వరుడికి ఎయిడ్స్ వుందని తెలిసి పెళ్లికి నో చెప్పిన యువతి.. కానీ ఇంటికెళ్లి బలవంతంగా ఇంజెక్షన్?

భర్తను స్నేహితుడి సాయంతో చంపేసిన భార్య.. నిద్రలో వుండగానే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీరిలీజ్ కు పోలీస్ గ్రౌండ్ సిద్ధం

Varun Tej: కొరియన్ ఫుడ్ తింటూ షూటింగ్ కు సిద్ధమవుతున్న కొరియన్ కనకరాజ్

Vishal: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు విశాల్

తర్వాతి కథనం
Show comments