డాబా స్టైల్.. మటన్ రిసిపీ ఇంట్లో ట్రై చేయండి!

Webdunia
శనివారం, 7 ఫిబ్రవరి 2015 (16:26 IST)
డాబా స్టైల్.. మటన్ రిసిపీ ఇంట్లోనే ట్రై చేయండి. డాబా స్టైల్ వంటకాలు సింపుల్‌గా వెరైటీ స్టైల్‌గా ఉంటాయి. ఉత్తరాది వంటకాల్లో బాగా పాపులర్ అయిన ఈ వంటకాన్ని ఈ వీకెండ్ ఇంట్లోనే ట్రై చేయండి. 
 
కావల్సిన పదార్థాలు: 
మటన్ ముక్కలు : అరకేజీ 
గుడ్లు : ఎనిమిది 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
టమోటో తరుగు : అరకప్పు 
బ్రెడ్ స్లైస్: 2  
బాదం, జీడిపప్పు : 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు : మూడు టీ స్పూన్లు 
కారం : ఒక టీ స్పూన్ 
జీలకర్ర పొడి : రెండు టీ స్పూన్లు 
మిరియాలు: రెండు టీ స్పూన్లు
పెరుగు : ఒక కప్పు
నెయ్యి : ఒక కప్పు 
ఉప్పు: రుచికి సరిపడా
 
తయారుచేయు విధానం : 
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, జీలకర్రపొడి, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని ఒక గంట మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 
ముందుగా స్టౌ మీద డీప్ బాటమ్ పాన్‌లో పెట్టుకోవాలి. వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ తయారుచేసుకోవడం కోసం డ్రైఫ్రూట్స్‌ను ముందు రోజు రాత్రే నీటిలో వేసి నానబెట్టుకొని ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
 
ఈ పేస్ట్‌ను వేగుతున్న ప్రైలో వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ బ్రౌన్ కలర్ లోకి మారుతున్నప్పుడు అందులో పచ్చిమిర్చి ఉప్పు మరియు టమోటో ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మటన్ ఉడికించుకోవాలి . ఎక్కువ నీరు పోయకూడదు.
 
మటన్ బాగా ఉడికి గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు అందులో ముందుగా నానబెట్టుకొన్న బ్రెడ్ వేసి మొత్తం గ్రేవీలో మిక్స్ చేయాలి. ఇప్పుడు గుడ్డును పగలగొట్టి ఒక గిన్నెలోకి పోసుకొని, అందులో కొద్దిగా కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పాన్‌లో వేసి ఉడికించుకోవాలి.
 
ఉడికించుకొన్న గుడ్డును బేకింగ్ పాన్‌లో అడుగు బాగంలో సర్ది, దాని మీద ముందుగా ఉడికించుకొన్న మటన్‌ను వేసి సర్దాలి. ఈ మటన్ మీద గిలకొట్టి పెట్టుకొన్న మిగిలిన గుడ్డు మిశ్రమాన్ని పోయాలి. మిగిలిన నెయ్యికూడా వేసి మైక్రోవొవెన్‌లో పెట్టి 5-10 బేక్ చేసుకోవాలి. అంతే డాబా స్టైల్ గోస్ట్ రిసిపీ రెడీ అయినట్లే. ఈ రిసిపీ రైస్ అండ్ రోటీలకు టేస్టీగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

Show comments