చింతచిగురుతో చికెన్ కూరనా? ఎలా చేయాలో చూద్దాం?

చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (13:40 IST)
చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇటువంటి చింతచిగురుతో చికెన్ కూర ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
చింతచిగురు - అరకిలో
చికెన్ - అరకిలో
కొబ్బరితురుము - 2 స్పూన్స్
కొత్తిమీర - 1 కప్పు
ధనియాలపొడి - 1 స్పూన్
అల్లంవెల్లులి పేస్ట్ - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
పుదీనా - 1 కప్పు
నూనె - సరిపడా
ఉల్లిపాయ - 1 
కారం - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
గరంమసాలా - 1 స్పూన్
 
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేసి ఆవాలు, జీలకర్ర బాగా వేయించుకోవాలి. తరువాత ఉల్లిముక్కులు వేసుకుని అవి వేగాక ఆ మిశ్రమంలో పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తరువాత కొబ్బరితురుము వేసి నిమిషం పాటు వేయించుకుని చికెన్ ముక్కులు వేసి ఉప్పు, కారం, ధనియాలపొడి, నీళ్లను పోసి ఉడికించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో చింతచిగురు వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకుని గరంమసాలా వేసి నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే చింతచిగురు మాంసం రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments