సండే స్పెషల్ వంటకం... చికెన్ లెగ్ పీసెస్‌తో...

Webdunia
చికెన్ లెగ్ పీస్ లు తీసుకుని వాటితో టేస్టీగా వుండే చికెన్ కబాబ్ చేస్తే ఈ సండే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
చికెన్ తొడలు- నాలుగు
వెనిగర్- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- పది
అల్లంముద్ద- ఒక టీస్పూను
వెల్లుల్లిముద్ద- ఒక టీస్పూను
పెరుగు- 300 గ్రాములు
గరంమసాలా పొడి- ఒక టీస్పూను
నూనె- రెండు టీస్పూన్లు
కొత్తిమీర- ఒక కట్ట
పుదీనా ఆకు రెమ్మలు- కొద్దిగా
ఉప్పు- సరిపడా
చాట్ మసాలా పొడి- ఒక టీస్పూను
పసుపు- కొంచెం
 
తయారీ విధానం :
కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. నాలుగు చికెన్ తొడలకు చాకుతో లోతుగా గంట్లు పెట్టి వెనిగర్ ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్దని బాగా పట్టించి పావుగంటసేపు నానబెట్టుకోవాలి. పెరుగు బాగా చిలికి ఉప్పు, గరం మసాలా పొడి, నూనె వేసి బాగా డైల్యూట్ చేసి చికెన్ ముక్కలను అందులో వేసి ఆరుగంటలపాటు ఊరనివ్వాలి.
 
తరువాత చికెన్ ముక్కల్ని బొగ్గుల సెగమీద దోరగా కాల్చాలి. ఆపై వీటిని ఒక ప్లేటులో పెట్టి చాట్ మసాలా పొడి చల్లి, ఉల్లిపాయ చక్రాలూ నిమ్మ డిప్పలతో అందంగా అలంకరించి అతిథులకు వడ్డించాలి. ఈ చికెన్ కబాబ్‌లను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

తర్వాతి కథనం
Show comments