వేడివేడి చికెన్ పకోడీని ఎలా తయారు చేస్తారు?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2015 (15:23 IST)
మాంసాహార ప్రియుల్లో చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. రుచికి రుచి, పోషకాలకు పోషకాలను అందించే మంచి మాంసకృత్తులు కలిగిన ఆహారం. దీంతో కూర, ఫ్రై, బిర్యానీ, పులావ్ ఇలా అనేక రకాల వంటకాలను చేసుకుంటారు. కానీ స్నాక్స్‌లా తినాలంటే మాత్రం చికెన్ పకోడీని ఆస్వాదించి తీరాల్సిందే. దీన్ని ఎలా తయారు చేస్తారో ఓ సారి పరిశీలిద్దాం. 
 
కావల్సిన పదార్థాలు...
బోన్‌లెస్ చికెన్ - 200 గ్రామాలు. 
పుదీన, కొత్తిమీర - కట్ట చొప్పున 
పచ్చి మిర్చి - 3
అల్లం - వెల్లుల్లి - తగినంత 
నిమ్మకాయ - 1
ధనియాల పొడి - చెంచా 
పెరుగు - 1 చెంచాలు 
శనగపిండి - 1/2 కప్పు. 
ఉప్పు - తగినంత 
వేయించడానికి సరిపడినంత నూనె. 
 
తయారీ విధానం...
ముందు పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటినీ శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి మిక్సీలో వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ రసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీన మిశ్రమంలో వేసి బాగా కలియ తిప్పాలి. గంటసేపు అయిన తర్వాత చెంచా వేడి నూనె, శనగపిండి కలిపి ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి అందులో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి. బంగారు వర్ణంలో వచ్చాక తీస్తే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. అయితే శనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కొంతమంది కలుపుతారు. దీంతో పకోడీలు కొంచెం క్రిస్పీగా మారి.. కర కరలాడతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Republic Day: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10,000 మంది ప్రత్యేక అతిథులు

Sabarimala: శబరిమల బంగారు స్మగ్లింగ్ కేసు.. 21 ప్రాంతాల్లో విస్తృత సోదాలు

దావోస్‌కు చేరుకున్న సీఎ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి

ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్.. ప్రమాదంలో భద్రతా సిబ్బంది కారు.. ఏమైందంటే?

హమ్మయ్య.. ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడుదల చేసేందుకు బంగ్లాదేశ్ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Asin: పదేళ్లు గడిచాయి.. అద్భుత భాగస్వామితో మా ప్రయాణం అదుర్స్.. అసిన్

Rashmi Gautam: కల్చర్ మరిచిపోయారు.. ఆవు, కుక్కలకు అన్నం పెట్టలేదా?

MM keeravani: వందేమాతరం నా జీవితలో మైల్ రాయి : కీరవాణి

సంకల్ప యాత్ర వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు : బండ్ల గణేశ్‌

రాంచరణ్ సినిమా కాకుండా.. అరుంధతి లాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Show comments