Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ స్పెషల్: చికెన్ కుర్మా ఎలా చేయాలి..

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (19:17 IST)
దోసెలు, నాన్, అన్నం, పలావ్‌లకు సూపర్ రిసిపీ చికెన్ కుర్మా. అలాంటి చికెన్ కుర్మాను రంజాన్‌ను పురస్కరించుకుని స్పెషల్‌గా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
శుభ్రం చేసిన చికెన్ ముక్కలు - కేజీ
టమోటా, వెల్లుల్లి తరుగు - చెరో అర కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి  తరుగు- రెండు స్పూన్లు 
పెరుగు- పావు కప్పు,
పసుపు - ఒక టీ స్పూన్ 
నూనె, ఉప్పు - తగినంత 
ఆవాలు - ఒక స్పూన్
దాల్చిన చెక్క- 1
జీలకర్ర- 1, 
కొత్తిమీర తరుగు- అరకప్పు 
కొబ్బరి పాలు - ఒక కప్పు 
 
తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసుకుని పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత బాణలిని స్టౌ మీద వుంచి నూనె పోయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, దాల్చిన చెక్క, పసుపు పొడి, అల్లం, వెల్లుల్లి పేస్టు, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, పచ్చిమిర్చి తరుగును వేసి బాగా వేపాలి. కాసేపయ్యాక టమోటాను చేర్చాలి. పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలను ఆ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. 
 
కారం కావాలనుకునే వారు ఒక స్పూన్ కారప్పొడిని చేర్చుకోవచ్చు. తర్వాత తగినంత నీరు చేర్చుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బరి పాలను చేర్చుకోవాలి. ఈ మిశ్రమం గ్రేవీలా వచ్చాక దించేయాలి. ఆపై కొత్తిమీర తరుగును చేర్చాలి. అంతే చికెక్ కుర్మా రెడీ... ఈ కుర్మాను వేడి వేడిగా చపాతీలు, దోసెలకు సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments