Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికమ్‌తో చికెన్ ఫ్రై ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 12 నవంబరు 2015 (17:21 IST)
క్యాన్సర్, అల్సర్, మెనోపాజల్ ప్రాబ్లమ్, గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే క్యాప్సికమ్‌తో చికెన్ ఫ్రై ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - అరకేజీ 
కాప్సికమ్  - పావు కిలో
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు- రెండు స్పూన్లు 
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్ 
పసుపు - పావు టీ స్పూన్ 
ఎండుమిర్చి- నాలుగు 
గరంమసాలా పొడి - పావు టీ స్పూన్ 
సోయాసాస్ - అర టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత 
ఉప్పు - తగినంత
  
తయారీ విధానం :
స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేడి చేసి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేపాలి. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని చేర్చాలి. పూర్తిగా మెత్తబడనివ్వకుండా వేపాలి. ఈ క్యాప్సికమ్ మిశ్రమంలో పసుపు, కారంపొడి, ఉప్పు వేసి ముందే శుభ్రం చేసి ఉడికించిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని చేర్చాలి.

చికెన్ ముక్కల్ని తడిపోయేంత వరకు వేయించి.. ఎండుమిర్చి పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసి కలుపుతూ వేయించాలి. చివర్లో సోయా సాస్ చేర్చి.. ఉప్పు తగినంత చేర్చుకుని దించేయాలి. క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. ఈ ఫ్రైని అన్నంలోకి లేదా రోటీలకు, నూడుల్స్‌కు కూడా సర్వ్ చేయవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments