సన్ డే స్పెషల్ : బ్రేక్ ఫాస్ట్ సైడిష్.. పన్నీర్ ఎగ్ కుర్మా!

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (17:57 IST)
సన్ డే మార్నింగ్ టిఫిన్‌కు సైడిష్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా.. అయితే పన్నీర్ ఎగ్ కుర్మా ట్రై చేయండి. దోసెలకు, ఇడ్లీలకు ఎప్పుడూ పచ్చడి, చట్నీలే కాకుండా వెరైటీగా ఎగ్ విత్ పన్నీర్‌తో హెల్దీ రిసిపీ పన్నీర్ ఎగ్ కుర్మాను ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు :
ఉడికించిన కోడిగుడ్లు : ఆరు
పన్నీర్ ముక్కలు : పావు కేజీ
ఉల్లిపాయ తరుగు : అర కప్పు 
టమోటో గుజ్జు: అరకప్పు 
వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ 
అల్లం పేస్ట్ : అర టీ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
కారం: ఒక టీ స్పూన్ 
పసుపు : కొద్దిగా 
ధనియాల పొడి: అర టీ స్పూన్ 
గరం మసాల: ఒక టీ స్పూన్ 
ఆయిల్ లేదా నెయ్యి - తగినంత 
పచ్చిమిర్చి పేస్ట్ : అర టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు: రెంటు టీ స్పూన్లు
 
తయారీ విధానం: 
1. ముందుగా గుడ్డును ఉడకబెట్టి, పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 
 
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయల తరుగును చేర్చి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. అందులోనే గరం మసాలా తప్ప మిగిలిన మసాలాలన్నింటిని వేసి (ఉప్పు, పసుపు, కొత్తిమీర, కారం) వేసి బాగా వేయించాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, నీరు ఇమిరిపోయే వరకూ ఉడికించుకోవాలి.
 
అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న పన్నీర్ తురుము లేదా పచ్చిబఠానీలను వేసి బాగా మిక్స్ చేయాలి.  కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులోనే ఒక కప్పు నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. దింపుకోవడానికి ముందు 10నిముషాలు సిమ్‌లో ఉంచాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి పరోటా, రోటి లేదా రైస్ తో సర్వ్ చేయాలి. అంతే పనీర్ ఎగ్ కుర్మా రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

Show comments