Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ లెగ్ సూప్ టేస్ట్ చేశారా.. హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

మటన్ లెగ్ సూప్ ద్వారా పిల్లల్లో ఎముకల పెరుగుదల సులభం అవుతుంది. ఇందులో క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దంతాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇతర మీట్ కంటే మటన్ ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. వ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (16:33 IST)
మటన్ లెగ్ సూప్ ద్వారా పిల్లల్లో ఎముకల పెరుగుదల సులభం అవుతుంది. ఇందులో క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దంతాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇతర మీట్ కంటే మటన్ ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. వర్షాకాలంలో జలుబు, మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. మటన్ లెగ్ సూప్ ట్రై చేయాల్సిందే. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
మటన్ లెగ్స్ - నాలుగు 
అల్లంవెల్లుల్లిముద్ద - పావు కప్పు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు 
గసగసాలు - పావు కప్పు 
పసుపు - చెంచా, 
మసాలా (బిర్యానీ ఆకులు, లవంగం) వంటివి- ఒక ప్యాకెట్
ఉల్లిపాయ తరుగు- పావు కప్పు 
కారం - 3 చెంచాలు, 
పుదీనా ఆకులు- ఒక కప్పు 
నూనె, ఉప్పు- తగినంత
కొత్తిమీర తరుగు - అర కప్పు 
లవంగాలు - నాలుగు
దాల్చినచెక్క - అంగుళం ముక్క, 
ఉప్పు: రుచికి సరిపడా,  
నిమ్మకాయ: ఒకటి
 
త‌యారీ విధానం : 
ముందుగా మటన్ లెగ్స్‌ను బాగా శుభ్రం చేసి.. గసగసాలు, కొబ్బరి ముద్దలా రుబ్బుకోవాలి. కుక్కర్లో మటన్ లెగ్స్ వేసి సగం కారం, సగం అల్లంవెల్లుల్లిముద్ద, ఉప్పు, పుదీనాతురుము, కొత్తిమీర‌ తురుము, తగినన్ని నీళ్లు పోసి అర‌గంటసేపు సిమ్‌లో పెట్టి ఉడికించాలి.

బాణలిలో నూనె వేసి దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, మిగిలిన అల్లంవెల్లుల్లిముద్ద వేసి వేయించాలి. త‌ర్వాత ఉల్లిముక్కలు, పసుపు, మిగిలిన కారం, దనియాలపొడి వేసి కలిపి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి - గసగసాల ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి. త‌రువాత‌ కుక్కర్‌లో ఉడికించిన మేక కాళ్లని నీళ్లతో సహా వేసి ఈ మిశ్రమంలో సుమారు పావుగంటసేపు ఉడికించాలి. చివరి టేస్ట్ చేసి.. సూప్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయాల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments