Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ పకోడి తయారీ విధానం తెలుసుకోండి!

Webdunia
చికెన్‌తో తయారు చేసే వంటకాల్లో చికెన్ పకోడీ ఒకటి. దీన్ని అనేక మంది అమితంగా ఇష్టపడతారు. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకోండి.

కావల్సి న పదార్థాలు.

బోన్‌లెస్ చికెన్ - పావుకేజీ
పుదీన, కొత్తిమీర - కట్ట చొప్పున
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం - చిన్నముక్క
వెల్లుల్లి - ఆరు రెబ్బలు,
నిమ్మకాయ - ఒకటి,
ధనియాలపొడి - చెంచా,
గరంమసాలా - చెంచా,
పెరుగు - రెండు చెంచాలు,
సెనగపిండి - అరకప్పు,
ఉప్పు - తగినంత,
నూనె - వేయించడానికి

తయారీ విధానం: పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి.. అన్నీ తీసుకొని మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. తరవాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకొని అందులో ధనియాలపొడి, గరంమసాలా, ఉప్పు, కారం, పెరుగు నిమ్మరసం, ముందుగా చేసి పెట్టుకున్న పుదీన ముద్ద వేసి బాగా కలియతిప్పాలి.

గంటయ్యాక చెంచా వేడి నూనె, సెనగ పిండి కలిపి ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అందులో సెనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి. బంగారు వర్ణంలో వచ్చాక టిష్యూపేపర్ పరిచిన పళ్లెంలోకి తీసుకొని నిమ్మకాయ ముక్కలు, ఉల్లి చక్రాలతో అలంకరించుకుంటే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

Chandra babu: త్వరలో సంజీవని ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సర్కారు

Amaravati: అమరావతి తొమ్మిది లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం.. తుది దశలో పనులు

Air India: విమానం రెక్కల్ని ఢీకొన్న పక్షి- 103మంది ప్రయాణీకులను కాపాడిన పైలట్

Jayalalitha: జయలలిత నెచ్చెలి శశికళ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Robo Shankar: తమిళ నటుడు రోబో శంకర్ కన్నుమూత.. అసలేమైంది?

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

Show comments