Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ జంప్ జిలానీ అరవింద్ రెడ్డి 'హస్తం' గుప్పెట్లో...

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2014 (21:18 IST)
FILE
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు ఇస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరతానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి చెప్పినట్టు వెల్లడించారు.

ఇదేవిషయంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు.. మరో నలుగురు టీఆర్ఎస్ సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అంతేకాకుండా, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అరవింద్ రెడ్డి జోస్యం చెప్పారు.

తాను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసిన మాట వాస్తవమేనని దీనికి కారణం తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన ఉండటమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments