Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు : 121 సీట్లలో ఐదో దశ పోలింగ్ స్టార్ట్!

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (09:27 IST)
File
FILE
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం 12 రాష్ట్రాల్లోని 121 లోక్ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటకలో 28, రాజస్థాన్‌లో 20, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 11, ఒడిశాలో 11, మధ్యప్రదేశ్‌లో 10, బీహార్‌లో 7, జార్ఖండ్‌లో 6, పశ్చిమ బెంగాల్‌లో 4, చత్తీస్‌గఢ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌లో 1, మణిపూర్‌లో ఒకటి చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో మొత్తం దాదాపు 16.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 121 స్థానాలకు, 1769 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వీటితో పాటు.. ఒడిషా అసెంబ్లీలోని 77 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లూ చేసింది.

ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఒడిషా, జార్ఖండ్ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments