Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుణ్ తేజ్‌పాల్ దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష!

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2014 (08:52 IST)
File
FILE
తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ (50)పై గోవా పోలీసులు నమోదు చేసిన అత్యాచారం, లైంగిక వేధింపులు రుజువైన పక్షంలో ఆయనకు ఏడేళ్ళ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

ఆయన గత ఏడాది నవంబర్‌లో పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, తరుణ్ తేజ్‌పాల్‍పై ఐపీసీ 354, 354-ఎ (లైంగిక వేధింపులు), 341, 342(అక్రమ నిర్బంధం), 376 (అత్యాచారం), 376(2)(ఎఫ్), 376(2)(కె) (అధికార దుర్వినియోగం, తన నిర్బంధంలోని మహిళపై రేప్) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టు దర్యాప్తు అధికారిణి సునీతా సావంత్ వెల్లడించారు. ఈ అభియోగాలతో మొత్తం 2,684 పేజీల చార్జిషీట్‌ను తయారు చేసి గోవా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనూజా ప్రభుదేశాయ్‌కు సమర్పించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?