Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.. నేను అరాచకవాదినే... రెండో రోజూ ధర్నా : కేజ్రీవాల్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2014 (08:52 IST)
File
FILE
ఢిల్లీ పోలీసు యంత్రాంగంపై పట్టు సాధించేందుకు స్వయంగా ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌... తనను తాను ఓ అరాచకవాదిగా ప్రకటించుకున్నారు. "అవును నేను అరాచకవాదినే. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కోసం ఇపుడు అరాచకం సృష్టించదల్చుకున్నా"నంటూ స్వయంగా ప్రకటించారు.

ఢిల్లీలో జరుగుతున్న అరాచకాలపై పోలీసులు సరిగా స్పదించడం లేదని, అధికారులు లంచాలు తీసుకుని పోస్టింగులు ఇస్తున్నారంటూ, సెక్స్, డ్రగ్స్ రాకెట్‌పై దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీని వెనుక హోం మంత్రి షిండే ఉన్నారంటూ ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ధర్నాకు దిగిన విషయం తెల్సిందే.

ఈ ధర్నాకు ఢిల్లీ వాసుల నుంచి మద్దతు లభించింది. ధర్నా ఎఫెక్టుతో ఢిల్లీలో నాలుగు మెట్రో రైల్వే స్టేషన్లను మూసి వేశారు. దీంతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడినా.. ధర్నాకు మాత్రం భారీగానే తరలివచ్చారు. మరోవైపు.. తమ డిమాండ్లను అంగీకరించేంత వరకు ధర్నా స్థలాన్ని వీడేది లేదని అరవింద్ కేజ్రీవాల్ భీష్మించి, రెండోరోజైన బుధవారం కూడా అక్కడే కూర్చొన్నారు.

హై సెక్యూరిటీ జోన్‌లో, అది కూడా రైల్వే ప్రధాన కార్యాలయం ఎదుట ఈ ఆందోళన చేపట్టడంతో రైల్వే అధికారులు ముందు జాగ్రత్తగా నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీంతో ధర్నాలో ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొంటారని, ప్రజలెవరూ రావద్దని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మెట్రో రైళ్లను నడపాలని ఢిల్లీ కమిషనర్‌ను కోరారు.

పరిస్థితిని అంచనా వేసిన అధికారులు రెండు స్టేషన్లను తెరిచారు. ధర్నా చేస్తున్న రోడ్డుపై నుంచే కేజ్రీవాల్ ఢిల్లీ పాలన చేస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా అక్కడే నిద్రించారు. కేజ్రీవాల్ ధర్నా నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ను సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రి షిండే కలిశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్