Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌కు 60 ఏళ్లిచ్చారు.. నాకు 6 నెలలు ఇవ్వండి : మోడీ

Webdunia
ఆదివారం, 19 జనవరి 2014 (14:52 IST)
FILE
' కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్లిచ్చారు. నాకు 6 నెలల సమయం ఇవ్వండి. దేశ గతిని మారుస్తా'నని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ, టీ అమ్మేవాడిని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు.

' మహిళలను గౌరవించడం, భద్రత కల్పించడం మన బాధ్యత' అని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో మానవవనరుల వినియోగంపై సరైన ప్రణాళిక లేదని, దానికి మార్గాన్ని చూపిస్తామని ఆయన అన్నారు.

దేశాభివృద్ధికి కావాల్సింది కమిటీలు కాదని, చిత్తశుద్ధి కావాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.

ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోలేక పోయిందని అన్నారు. ఓటమి కళ్ల ముందే కనిపిస్తుంటే ఏ తల్లీ తన కుమారుడ్ని బలి చేయదని తెలిపారు. ప్రధానిని ఎంపీలు ఎన్నుకోవడం తమ సంప్రదాయం అంటున్న రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ లను ఎవరు ఎన్నుకున్నారో తెలుసుకోవాలని సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

Show comments