Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి కాంగ్రెస్‌లో ముసలం.. రంగాస్వామి రాజీనామా

Webdunia
పుదుచ్చేరి కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్.రంగస్వామి గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన మద్దతుదారుడైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అంగాళన్ కూడా ఇదే బాట పట్టారు. మరికొంతమంది అనుచర ఎమ్మెల్యేలు కూడా రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అనంతరం వీరంతా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు పుదుచ్చేరి కాంగ్రెస్ వర్గాల సమాచారం.

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ఏడున్నరేళ్లు ఏకచత్రాధిపత్యంగా చక్రం తిప్పారు. 2008లో పార్టీలో నెలకొన్న విభేదాలు ఆయన్ను పదవీచ్యుతుడిని చేశాయి. అప్పట్నుంచి పార్టీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కామరాజర్ కాంగ్రెస్ పేరుతో రంగస్వామి కొత్త పార్టీ స్థాపించవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.

దీనికి తగినట్టుగానే ఆయన మద్దతుదారులు మంతనాలు వేగవంతం చేశారు. కొంతమంది పీఎంకే ఎమ్మెల్యేలు సైతం వారికి మద్దతివ్వడం పుదుచ్చేరి కాంగ్రెస్‌లో ఆందోళన రేపింది. రంగస్వామిని బుజ్జగించేందుకు ఏఐసీసీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Show comments