Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతితో భేటీ కానున్న పీఎం: మంత్రివర్గ మార్పులపై చర్చ!!

Webdunia
ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో సమావేశం కానున్నారు. సాధారణంగా రాష్ట్రపతిని ప్రధానమంత్రి కలుసుకోవడం అరుదు. కేవలం మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యస్థీకరణ, దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సందర్భాల్లోనే రాష్ట్రపతి భవన్‌కు ప్రధానమంత్రి వెళుతుంటారు.

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీనికి ముందుగానే ఆయన తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగానే ప్రధాని కేబినెట్‌ను పునర్వ్యస్థీకరించనున్నారు.

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో శశిథరూర్, ఏ.రాజా, పృథ్విరాజ్ చవాన్‌ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు.. మరికొందరు కాంగ్రెస్ నేతలను మంత్రిపదవుల నుంచి తొలగించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని తొలగించి ఆయనకు హోంశాఖ, హోంశాఖామంత్రి చిదంబరంకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

కీలకమైన ఆర్థిక శాఖను మాత్రం ఆర్థికవేత్తలు సి.రంగరాజన్ లేదా మాంటెక్ సింగ్ అహ్లువాలియాలలో ఒకరికి కట్టబెట్టాలని ప్రధాని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రధాని, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీలు కొత్త మంత్రివర్గం జాబితాను తయారు చేసినట్టు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

Show comments